తెలంగాణ నూతన మంత్రుల శాఖలు ఇలా... హరీష్ రావుకు అర్ధిక శాఖ.. సబితకు విద్యాశాఖ..
Recommended Video
కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 6 గురు మంత్రులకు శాఖలు కేటాయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేబినెట్‌లోకి కొత్తవారిని తీసుకున్న కేసీఆర్... వారికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. కీలకమైన ఆర్థికశాఖను మంత్రి హరీష్‌రావుకు కేటాయించారు. ఇక సీఎం తనయుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన కేటిఆర్‌కు గతంలో నిర్వహించిన మున్సిపల్ శాఖతో పాటు ఐటీ మరియు ఇండస్ట్రీస్‌ను కేటాయించారు.కాగా మంత్రి జగదీశ్ రెడ్డి శాఖను మార్చి విద్యుత్ శాఖను కేటాయించారు.
మరోవైపు మహిళ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖను కేటాయించగా సత్యవతి రాథోడ్‌కు గిరిజన సంక్షేమంతో పాటు మహిళ మరియు శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. కాగా మొదటిసారి మంత్రి బాధ్యతలు చేపట్టిన గంగుల కమాలాకర్‌కు వెనకబడిన తరగతుల సంక్షేమంతో పాటు ఫుడ్ అండ్ సివిల్ సైప్లయిస్ వ్యవహారాలను కేటాయించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి వద్ద ఉన్న రావాణశాఖను పువ్వాడ అజయ్ కుమార్‌కు కేటాయించారు.మరోవైపు జగదీశ్ రెడ్డి ప్రస్తుతం నిర్వహిస్తున్న విద్యాశాఖను సబితా ఇంద్రారెడ్డి కేటాయించగా జగదీశ్ రెడ్డికి సీఎం వద్ద ఉన్న విద్యుత్ శాఖను కేటాయించారు. కాగా జగదీశ్ రెడ్డి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడ విద్యుత్ శాఖను కేటాయించారు.

ప్రస్థుతం మొత్తం కేటాయించిన శాఖలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..
1 హరీష్ రావు -ఆర్ధిక శాఖ
2 కేటీఆర్ -ఐటి పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ
3 పువ్వాడ అజయ్‌కుమార్ - రవాణాశాఖ
4 గంగుల కమలాకర్- బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖలు
5 సత్యవతి రాథోడ్-గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖలు
6 సబితా ఇంద్రారెడ్డీ - విద్యాశాఖ
7 ఈటల రాజేందర్- వైద్య, ఆరోగ్యశాఖ
8 నిరంజన్ రెడ్డి- వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలు
9 తలసాని శ్రీనివాస్ యాదవ్- పశుసంవర్ధక శాఖ, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ
10 ప్రశాంత్ రెడ్డి- రోడ్డు, భవనాలు, శాసనసభా వ్యవహారాలు
11 మల్లారెడ్డి- కార్మికశాఖ,
12 ఇంద్రకరణ్ రెడ్డి- దేవాదాయ, న్యాయ, పర్యావరణ, అటవీశాఖ
13 ఎర్రబెల్లి దయాకర్ రావు- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
14 శ్రీనివాస్ గౌడ్- ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు, పురావస్తు
15 కొప్పుల ఈశ్వర్- సాంఘిక సంక్షేమం, మైనార్టీ సంక్షేమం
16 జగదీష్ రెడ్డి- విద్యుత్ శాఖ
17,మహమ్ముద్ ఆలీ - హోంశాఖ
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications