RTC Special Buses: సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఫ్రీపై క్లారిటీ..
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(TSRTC) ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 7 నుంచి జనవరి 15 వరకు 4484 ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందా అని మీకు డౌట్ రావొచ్చు. దీనిపై కూడా ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. సంక్రాంతికి నడిచే ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రత్యేక బస్సులకు సంబంధించి శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఆర్టీసీ భవన్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమీక్ష నిర్వహించారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీ ఉండే మార్గాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతామని సజ్జనార్ చెప్పారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ ఎక్స్ రోడ్, అరాంఘర్, ఎల్బీ నగర్, కేపీహెచ్బీ, బోయిన్ పల్లి, గచ్చిబౌలి నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికలు రద్దీని బట్టి స్టాప్ ల వద్ద తాగు నీరు, కూర్చీలు, మొబైల్ టాయిలెట్స్, టెంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ స్టాప్ ల వద్ద ఇద్దరు డీవీఎం స్థాయి అధికారులను నియమించనున్నారు. వారు ప్రత్యేక బస్సుల గురించి సమాచారం ఇస్తారని పేర్కొన్నారు. బస్ టికెట్ల ధరలు పెంచబోమని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు టీఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు సజ్జనార్ ప్రకటించారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications