తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరోసారి వరుస సెలవులు..
తెలంగాణలోని విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్. మరోసారి వరుస సెలవులు వచ్చాయి. ఇటీవల వరుసగా మూడు రోజులు హాలీడేస్ వచ్చాయి. తాజాగా మరోసారి మూడు రోజులు సెలవులు రావడంతో స్టూడెంట్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇటీవల ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి, ఆగస్టు 10న ఆదివారం సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మారోసారి మరో మూడు రోజులు సెలవులు రానున్నాయి.
ఈ వారంలో ఆగస్టు 15 శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పబ్లిక్ హాలీడే ఉంటుంది. ఆ తర్వాతి రోజు అంటే ఆగస్టు 16న కృష్ణాష్టమి పండుగ ఉంది. కృష్ణాష్టమి పండుగను దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. ఈ పండుగను పురస్కరించుకుని పాఠశాలలకు సెలవు ఇచ్చారు. ఇక అనంతరం ఆగస్టు 17 ఆదివారం కావడంతో ఆ రోజు సాధారణంగా సెలవు ఉంటుంది. దీంతో మరోసారి విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఫుల్ జోష్ మీద ఉన్నారు.

ఇక ఆగస్టు నెలలో విద్యార్థులకు ఫుల్ హాలీడేస్ వచ్చాయి. దీంతో ఈ నెలలో పాఠశాలలు కేవలం 15 నుంచి 20 రోజుల పాటే నిర్వహించినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీ విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఎంప్లాయిస్ కు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సొంతూళ్లకు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ట్రైన్లు, బస్సుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తోంది.












Click it and Unblock the Notifications