Telangana Teacher Recruitment:ఎన్నికల వేళ 9వేల పోస్టుల భర్తీకి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సర్కార్ అన్ని రంగాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా యువతకు ఉద్యోగాల కల్పనపై ఫోకస్ చేసింది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో అతిపెద్ద ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్‌టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TREI-RB) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 9231 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇందులో 4020 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 2008 జూనియర్ లెక్చరర్లు/ఫిజికల్ డైరెక్టర్లు/జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్ల పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. పీజీ టీచర్లు 1276,868 లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్లు, స్కూళ్లలో 434 లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేస్తారు.

kcrteachersrecuitment

మొత్తం 9 నోటిఫికేషన్లు విడుదల కాగా ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఇందుకోసం బోర్డు వెబ్‌సైట్ www.treirb.telangana.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. ఇక జూనియర్ కాలేజీలో భర్తీ చేసే పోస్టుల వివరాలు అర్హతలు ఇతరత్రా వివరాలను ఏప్రిల్ 17వ తేదీన పైన ఇచ్చిన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

అదే సమయంలో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, లైబ్రేరియన్, స్కూళ్లలో ఫిజికల్ డైరెక్టర్, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT)కి సంబంధించిన ఖాళీలు, ఇతరత్ర పూర్తి వివరాలను ఏప్రిల్ 24, ఏప్రిల్ 28వ తేదీన వెబ్‌సైట్‌పై పొందుపరుస్తారు. ఇక నిరుద్యోగులు లేదా టీచర్‌గా స్థిరపడాలనుకునేవారికి ఈ భారీ నోటిఫికేషన్ ఒక వరమే అని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+