అరుదైన ఘనత సాధించిన తెలంగాణ.. అవయవ దానంలో దేశంలోనే టాప్ !

అవయవ దానం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. గొప్ప సాంఘిక సేవగానే కాకుండా అత్యంత పుణ్యకార్యంగా భావించే ఈ విషయంలో రాష్ట్రం దేశవ్యాప్తంగా అగ్రగామిగా నిలిచింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2024 సంవత్సరానికి గాను రాష్ట్రం ప్రతి 10 లక్షల జనాభాకు 4.88 అవయవ దానాలు జరిగాయి. ఇది దేశ సగటు 0.8 కంటే చాలా ఎక్కువగా చెబుతున్నారు. అందుకు గాను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా.. తెలంగాణ జీవన్‌దాన్ ప్రతినిధులకు NOTTO అవార్డు అందజేశారు.

అవయవదానంలో తెలంగాణ టాపర్‌‌గా నిలవడం పట్ల రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. అవయవాలు పాడైపోయిన వ్యక్తుల ప్రాణాలు కాపాడే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 2012లో జీవన్‌దాన్ ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. బ్రెయిన్ డెత్ కేసులలో అవయవాలు వృథా పోకుండా.. దానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అవయవమార్పిడి చికిత్సను అందిస్తున్నామన్నారు. 2024లో 188 మంది బ్రెయిన్ డెత్ డోనర్ల నుంచి, 725 అవయవాలను ఇతరులకు అమర్చామని తెలిపారు.

telangana-tops-the-country-in-organ-donation-and-received-notto-award

జీవన్‌దాన్ కార్యక్రమం..

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2012లో "జీవన్‌దాన్" కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా బ్రెయిన్ డెత్ గా ప్రకటించబడిన వ్యక్తుల నుంచి అవయవాలను సేకరించి అవసరమైన వారికి సమర్ధవంతంగా అమర్చే విధానాన్ని ఏర్పాటుచేశారు. పేద, ధనిక అనే తేడా లేకుండా, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారందరికీ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ పథకం రూపొందించబడింది.

జీవన్‌దాన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది?

  • బ్రెయిన్ డెత్ నిర్ధారణ
  • డోనర్ కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్
  • అవసరమున్న లబ్ధిదారుల గుర్తింపు
  • గ్రీన్ కారిడార్ ఏర్పాటు
  • అవగాహన ప్రచారం

ఈ కార్యక్రమాన్ని సీటాక్ కమిటీ (Cadaver Transplantation Advisory Committee) పర్యవేక్షిస్తుంది. హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలానే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడిగా, నిమ్స్ డైరెక్టర్ కో చైర్మన్‌గా ఉంటారు. యాక్ట్ (Appropriate Authority for Cadaver Transplantation) అమలులో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+