ఈనెల కరెంట్ బిలుల్లో అదనపు బాదుడు.. వారికి మాత్రం రిలీఫ్!

తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు కీలక అప్డేట్. విద్యుత్ వినియోగదారులకు ఈనెల కరెంట్ బిల్లులో కొత్త బాదుడుకు రంగం సిద్ధం అయ్యింది. నవంబర్ నెల కరెంట్ బిల్లుల్లో కొత్త భారం మొదలైంది. ట్రూ-అప్ ఛార్జీల పేరిట అదనపు మొత్తం వసూలు చేయడం తెలంగాణా రాష్ట్ర విద్యుత్ డిస్కంలు ప్రారంభించాయి. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి టీజీఈఆర్‌సీ అనుమతి మేరకు డిస్కంలు ఈ ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.

2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన అదనపు వ్యయం, రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి ఈ ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మొత్తం రూ.7,635 కోట్లలో రూ.5,420 కోట్లు వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. మిగతా మొత్తం వ్యవసాయ విభాగానికి సంబంధించినది కావడంతో ప్రభుత్వం భరిస్తుంది. నవంబర్ నెలలో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసలు చొప్పున వసూలు చేస్తారు.

Telangana true-up charges Appear in November Electricity Bills - Gruha Jyothi Beneficiaries Safe

ఉదాహరణకు 100 యూనిట్లు వినియోగించే వారికి నవంబర్‌లో రూ.30, ఆ తర్వాత నెలల్లో రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఈ ఛార్జీలు సాధారణ బిల్లుతో కలపకుండా ప్రత్యేకంగా చూపిస్తున్నారు. దక్షిణ డిస్కం పరిధిలో 29 నెలలు, ఉత్తర డిస్కం పరిధిలో 26 నెలల పాటు ఈ వసూళ్లు కొనసాగనున్నాయి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు కరెంట్ వినియోగించే వారికి మాత్రం ఉపశమనం ఉంది.

ప్రభుత్వం వారికి జీరో బిల్లు ఇస్తున్నందున ట్రూ-అప్ ఛార్జీల భారం వారిపై పడదు. ప్రస్తుతం 200 యూనిట్ల లోపు వాడుతున్నవారికి బిల్లు మైనస్‌లోనే వస్తోంది. కాబట్టి గృహజ్యోతి లబ్ధిదారులు ఈ అదనపు భారం నుంచి సేఫ్‌గా ఉన్నారు. వినియోగదారులు తమ బిల్లులను జాగ్రత్తగా పరిశీలించాలి. ట్రూ-అప్ ఛార్జీలు ప్రత్యేకంగా చూపించబడుతున్నాయి.

ఇందిరమ్మ టవర్స్‌ కోసం నవంబర్ 4న మరో లాటరీ.. కారణం ఇదే!
ఇందిరమ్మ టవర్స్‌ కోసం నవంబర్ 4న మరో లాటరీ.. కారణం ఇదే!

ఏదైనా సందేహం ఉంటే సంబంధిత డిస్కం కస్టమర్ కేర్‌ను సంప్రదించవచ్చు. ఈ చర్య వల్ల సాధారణ వినియోగదారులపై కొంత భారం పడుతున్నప్పటికీ, గృహజ్యోతి పథకం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొంత ఉపశమనం కలుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+