రాష్ట్రంలో సమ్మర్ లో వర్షాలు.. ఆ నాలుగు రోజులు..!
రాష్ట్రంలో శీతాకాలం ముగిసినట్లుగానే భావించాలి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు, ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇక రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు 17- 19 డిగ్రీలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. క్రమంగా ఉష్ణోగ్రతల్లో భారీ పెరుగుదల ఉంటుందని వివరిస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.
తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా ప్రకారం.. రాష్ట్రంలో ఎండాకాలంలో కూడా వర్షాలు కురుస్తాయని సమాచారం. వేసవి ప్రథమార్థంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లో ఎండలతో పాటు వర్షాలు కూడా ఉంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తన ఎక్స్ వేదికగా తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో ఎండాకాలంలో వర్షాలు ఉంటాయని వెల్లడించారు.
తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం.. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరగడమే కాకుండా అక్కడక్కడా వర్షాలు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ మేరకు 3 నెలలపాటు వర్షాలుంటాయని... తర్వాత అసలైన ఎండాకాలం మొదలవుతుందని హెచ్చరిస్తున్నారు. మే, జూన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎండలు మండిపోతాయని వెదర్ మ్యాన్ తెలిపారు.

ఇక రాష్ట్రంలో 2023లోని వాతావరణ పరిస్థితులు ఈసారి కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందని.. ఈ సారి సమ్మర్ ఎక్కువ రోజులు ఉంటుందని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు. అంతేకాక నైరుతి రుతుపవనాలు ఈ సారి ఆలస్యం అవుతాయని.. అప్పటివరకు ఎండలు, ఉక్కపోత తప్పవని చెబుతున్నారు. ఇక రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications