తెలంగాణ ఎన్నికల ప్రచారాల్లో బుల్లితెర నటులు.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రోజురోజుకు వేగంగా సాగుతుంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థుల జాబితాలు కూడా విడుదలయ్యాయి. దీంతో ఆయా పార్టీల నాయకులందరూ ప్రచారాలపై ఎక్కువగా దృష్టి సారించారు. అయితే, వారితో పాటు కొంతమంది బుల్లితెర యాంకర్లు కూడా ఈ ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. తెలంగాణలోని ప్రధాన పార్టీ అయిన భారత్ రాష్ట్ర సమితి (BRS) కి బుల్లితెర స్టార్స్ కూడా తమ మద్దతును తెలుపుతున్నారు. ఈ సందర్బంగా వారు కొన్ని వీడియోలను తమ ఖాతాలో పోస్టు చేసి మరీ బిఆర్ ఎస్ పార్టీకి మద్దు ప్రకటించి మరీ ప్రచారం చేస్తున్నారు.
Etlunde Telangana Etlaindi Telangana, Vote for KCR అంటూ హ్యాష్ ట్యాగ్‌లు పెడుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని మరింతగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వీటికి సంబంధించిన రీల్స్‌ను తమ సోషల్ మీడియాలోని ఖాతాలలో పోస్ట్ చేశారు. ఇవి కాస్త ఇప్పడు వైరల్‌గా మారాయి.

యాంకర్ శ్రీముఖి : యాంకర్ శ్రీముఖి తన మాటలతోనే కాకుండా అందంతో కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. శ్రీముఖి తాజాగా తమ నిజామాబాద్ లో జరిగిన అభివృద్ధిని చెబుతూ సోషల్‌మీడియాలో ఓ వీడియోను పంచుకుంది. రోడ్లు, డ్రైయినేజీలు, వాటర్ ట్యాంక్స్, ఆస్పత్రుల అభివృద్ధి గురించి ఈ వీడియోలో పేర్కొంది. 2014కు ముందు 2023లో నిజామాబాద్ అభివృద్ధి గురించి ఈ వీడియోలో ఉంది.
అషురెడ్డి : బిగ్‌బాస్‌లో పోటీచేసి ఎంతో ఫేమ్‌ను సంపాదించుకుంది అషురెడ్డి. ఈ అమ్మడు కూడా తాజాగా బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపుతూ అభిమానులతో ఓ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో అషురెడ్డి తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన అభివృధ్ధి గురించి చెప్పే ప్రయత్నం చేసింది. దుర్గం చెరువు, గండిపేట్, మంచిరేవుల వంటి అర్బన్ ఫారెస్ట్ లు అదే విధంగా సోలార్ సైక్లింగ్ ట్రాక్, ఐటీ కారిడార్ లోని వృద్ధి గురించి ఇందులో చెప్పింది.
యాంకర్ విష్ణు ప్రియా :యాంకర్ విష్ణు ప్రియా కూడా బిఆర్ఎస్ పార్టీకి మద్దతునిస్తూ హైదరాబాద్ లోని ట్రాఫిక్ సమస్య తీరిపోయిందని వీడియోలో చెప్పుకొచ్చింది. ఈ ప్రభుత్వం వల్లే ఫ్లైఓవర్స్, మెట్రో సాధ్యపడాయని, రోడ్ ట్రాన్స్ పోర్ట్ మెరుగైందని తను షేర్ చేసిన వీడియోలో పేర్కొంది.
హరితేజ : నటి హరితేజ అందరికి తెలిసిన అమ్మాయే. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. యాంకర్‌గా కూడా అదరగొట్టేసింది. బిగ్‌బాస్‌లో కూడా తనేంటో నిరూపించింది. ఇప్పుడు తాజాగా హరితేజ కూడా బిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో పాల్గొంది. అయితే, ఆమె పోస్ట్ చేసిన వీడియో ఆడపడుచులకు ప్రభుత్వం చేసిన సాయాన్నిగురించి వివరించింది. పెన్షన్లు, మహిళలకు ఇళ్ల పంపిణీ వంటి వాటిని గుర్తు చేస్తూ ఓ వీడియోను తన అభిమానులతో పంచుకుంది.
యాంకర్ సావిత్రి : బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి, యాంకర్ సావిత్రి గురించి అందరికి తెలిసిందే. ఆమె కూడా బిఆర్ ఎస్ పార్టీకి తన మద్దతు ప్రకటిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో తెలంగాణలోని నీరుపాదల ప్రాజెక్ట్స్, నీళ్లు, రైతులకు కలిగిన లాభాలను వివరించారు. కరెంట్, రైతు భీమా, తదిర అంశాల గురించి కూడా వీడియోలో చెప్పుకొచ్చారు.
జబర్దస్త్ సుజాత : యాంకర్‌గా అందరికి సుపరిచితురాలైన సుజాత, ఆ తర్వాత బిగ్‌బాస్‌లో అందరిని మెప్పించారు. ఇప్పుడు జబర్దస్త్‌లో కూడా అందరిని ఆకట్టకుంటున్నారు. తాజాగా ఈమె కూడా ఓ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. అందులో హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గురించి చెప్పారు. సెక్రటేరియేట్, అమరవీరుల స్థూపం, అంబేదర్క్ విగ్రహ నిర్మాణం.. అంటూ చెప్పుకొచ్చారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications