విజయ్ ఆత్మహత్య: వనిత అరెస్ట్‌కు రంగం సిద్ధం, పరారీలో నిందితులు
హైదరాబాద్: నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో అతని భార్య వనితను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. తన చావుకు భార్య వనితతో పాటు మరో ఇద్దరు కారణం అంటూ విజయ్ సాయి ఉరి వేసుకోవడానికి మందు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.
Recommended Video

దీనిని మరణ వాంగ్మూలంగా చేసుకొని వనితను అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. విజయసాయి ఆత్మహత్య తర్వాత కనిపించిన వనిత.. ఆ తర్వాత నుంచి అందుబాటులో లేకుండా పోయింది. దీంతో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె ఎక్కడున్నది పోలీసులు గుర్తించారు.

కారు చుట్టూ వివాదం
ఆత్మహత్యకు ముందు రోజు వనిత తన కారును బలవంతంగా తీసుకు వెళ్లిందని విజయ సాయి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం వెలుగు చూసింది. దీంతో అసలు కారును బలవంతంగా ఎందుకు తీసుకు వెళ్లాల్సి వచ్చింది అనే కోణాల్లో పోలీసులు వనిత నుంచి రాబట్టాల్సి ఉంది. కాగా ఈ ఆత్మహత్య విషయంలో ముఖ్యంగా కారు చుట్టు వివాదం తిరుగుతోంది.

రెండు వేర్వేరు సెల్ఫీలు
తన మృతికి భార్య వనితతో పాటు లాయర్ శ్రీనివాస్, శశిధర్ కారణమంటూ ఆత్మహత్యకు ముందు విజయ్ తన సెల్‌ఫోన్లో తీసుకున్న రెండు వేర్వేరు సెల్పీల్లో స్పష్టం చేశారు. వీటిని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. విజయ్ తండ్రి కేవీ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదులో ఈ ముగ్గురి పేర్లు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారు.

వనితకు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లారు
వనితకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆమె నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె తల్లి ఉంది. వనిత గురించి పోలీసులు విచారించగా ఆమె సూర్యాపేటలో ఉన్నట్లు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. తన కుమార్తెకు జ్వరంగా ఉందని, తాను పోలీస్ స్టేషన్‌కు వస్తానని పోలీసులకు చెప్పారని సమాచారం.

నిందితుల 3 నెలల కాల్ డేటా సేకరణ
లాయర్ శ్రీనివాస్ సెల్‌ఫోన్లో అందుబాటులో లేకపోవడంతో ఆయనను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శశిధర్ ప్రమేయంపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులకు సంబంధించిన మూడు నెలల కాల్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు.
-
విజయ్ పార్టీలో సినిమా చిచ్చు! కీలక పార్టీ మద్దతు ఖతం -
విజయ్ విజిల్ రీసౌండ్- పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్












Click it and Unblock the Notifications