Weather Report: తెలంగాణలో తగ్గుతోన్న ఉష్ణోగ్రతలు..

తెలంగాణలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతోన్నాయి. వారం క్రితం వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు కాగా.. తాజాగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి పూట ఉష్ణోగ్రత తగ్గుతోంది. క్రమంగా చలి పెరుగుతోంది. నైరుతి రుతుపవనాలు తిరోగమనంతో వాతావరణం మారుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో మధ్యాహ్నం ఎండగా ఉండగా.. రాత్రి చలి ఎక్కువగా ఉంటుంది. అటు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపు చల్ల గాలులు వీస్తున్నాయి. దీంతోనే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.

మరోపక్క పగటి పూట ఎండగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతవరణ శాఖ చెబుతోంది. ఈశాన్య దిశల నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

Temperatures are gradually decreasing in Telangana

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలికాలం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈసారి కూడా తక్కువు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రెండు రోజులుగా వాతావరణంలో వేగంగా మార్పులు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వివరించింది. ప్రధానంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో కని ష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. మెదక్, వరంగల్‌ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ మధ్యన నమోదు అవుతున్నాయి.

ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2 డిగ్రీ సెల్సియస్‌ తక్కువగా నమోదు అయ్యాయి.
ఉత్తర ప్రాంతంలో మాత్రం సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 35.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 15 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+