గుండెపోటుకు రూ. 45 వేల ఇంజెక్షన్.. ఇక్కడ పూర్తి ఉచితం..!
ఒకప్పుడు 50- 60 సంవత్సరాలు దాటితే కనిపించే గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఈరోజుల్లో చిన్నా పెద్దా తేడాలేకుండా.. వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. గుండెపోటుతో చిన్న వయసులోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు.. జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుండెపోటుకు గురైనవారికి ఇచ్చే టెనెక్టిప్లెస్ అనే సూది మందు ధర మార్కెట్ లో రూ. 45 వేలు ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మందు ఉచితంగా లభ్యం అవుతోంది. అయితే అవగాహన లోపంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
టెనెక్టిప్లెస్ ఇంజెక్షన్ ఎలా ఇస్తారు..?
ముందుగా ట్రైకాగ్ ఈసీజీ యంత్రం సాయంతో రోగికి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వైద్యుల ప్రొటోకాల్ నిబంధనలకు అనుగుణంగా రోగికి టెనెక్టిప్లెస్ ఇంజెక్షన్ ఇస్తారు. ఈ సూది మందును ఇంజక్షన్, సెలైన్ రూపంలో రెండు రకాలుగా అందిస్తారు. దీనివల్ల గుండెపోటు వచ్చిన వారికి రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. ఇది గుండెలో రంధ్రాలను శుభ్రం చేస్తుంది. అలాగే రక్తం సరఫరా చేసేందుకు సహాయపడే రక్తనాళాలు కుచించుకుపోకుండా చేస్తుంది. ప్రాథమికంగా కోలుకున్న రోగికి మెరుగైన చికిత్స అందించేందుకు వీలవుతుంది.

ఈ ఆస్పత్రుల్లో ఫ్రీగా..
నిజామాబాద్, కామారెడ్డి జనరల్ ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ ఉచితంగా లభ్యం అవుతుంది. నిజామాబాద్ జిల్లాలో ఏడాదిలో 118 మంది హృద్రోగులకు టెనెక్టిప్లెస్ సూది మందు ఇచ్చారు. ప్రతినెలా ఆరు నుంచి ఏడుగురికి ఉచితంగా మందును అందిస్తున్నారు. టైకాగ్ ఈసీజీ రిపోర్టును హైదరాబాద్‌లోని స్టెమీ ప్రోగ్రాం కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో నిమిషాల వ్యవధిలోనే గుండెపోటు తీవ్రతను తెలుసుకోవచ్చు. దీని ఆధారంగానే సూది మందును ఇస్తున్నారు.
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఇది అందుబాటులో ఉన్నా, అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడం లేదు. ఈ ఇంజెక్షన్ గుండె సంబంధిత వైద్యులు లేకపోయినా.. జనరల్ ఫిజీషియన్ ఆధ్వర్యంలో దీనిని రోగులకు ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications