సానియా మీర్జా పక్కన నేమ్ ప్లేట్ లో చేరిన మరో పేరు..!!
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యవహారం మరోసారి చర్చగా మారింది. సానియా భర్త షోయబ్ మాలిక్ నుంచి విడిపోయిన తరువాత సానియా వివాహం గురించి మరోసారి చర్చ జరుగుతోంది. అనేక అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సమయంలోనే సానియా వీటికి ముగింపు పలుకుతూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. తన నేమ్ బోర్డులో కొత్తగా చేరిన పేరుతో తాను ఎం చెప్పలదచుకున్నారో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సానియా నేమ్ బోర్డు వైరల్ అవుతంది.
సానియా మీర్జా నేమ్ బోర్డు
సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2010లో హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. 2018లో ఈ దంపతులకు ఓ కుమారుడు (ఇజాన్) జన్మించాడు. అయితే, ఇటీవలే వీరు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఆ తర్వాత షోయబ్ ముచ్చటగా మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. పాకిస్థాన్ ప్రముఖ సినీతారగా గుర్తింపు పొందిన సనా జావెద్‌ను ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకొని అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కుమారుడి పేరు చేర్చి
కానీ, సానియా మాత్రం ప్రస్తుతం కుమారుడితో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తన పాత జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరుపేసుకుంటూ లైఫ్‌ను కొత్తగా మొదలెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇంటి నేమ్ ప్లేట్‌ను కూడా మార్చేసింది. తన పేరు పక్కన కుమారుడు ఇజాన్ పేరు ఉండేలా 'సానియా ఇజాన్' అంటూ నేమ్ ప్లేట్‌ను తయారు చేయించుకుని ఇంటి ముందు తగిలించేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సానియా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
సానియా సంకేతాలు
కొద్ది రోజులుగా సానియా సినీ ప్రముఖ హీరోను పెళ్లిచేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీని పైన ఎవరూ నిర్ధారించలేదు. ఈ సమయంలోనే సానియా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన తన నేమ్ బోర్డు ద్వారా తాను మరోసారి పెళ్లి ఆలోచనతో లేననే సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. తాను తన కుమారుడు మాత్రమే ఇక జీవితం అన్నట్లు ఈ ఫొటో వెనుక పరామర్ధమనే చర్చ మొదలైంది. అయితే, సానియా తన భవిష్యత్ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications