హుజురాబాద్ లో టెన్షన్: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. పోటాపోటీ ఫ్లెక్సీలు; అరెస్టులతో రచ్చరచ్చ!!
హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. నువ్వా నేనా అన్నట్టు మాటల తూటాలను సంధించడంతో పాటుగా, సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకొని పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం నియోజకవర్గంలో ఉద్రిక్తతకు కారణమైంది. పోలీసుల అరెస్టులతో నియోజకవర్గంలో టెన్షన్ చోటుచేసుకుంది.

హుజురాబాద్ లో సవాళ్లు ప్రతిసవాళ్ళ పర్వం
హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ మీద గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల బరిలోకి దిగుతానని చేసిన వ్యాఖ్యలతో, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు. నియోజకవర్గంలోని అభివృద్ధి చేయలేని ఈటల రాజేందర్, గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఏం చేస్తారు అంటూ ప్రశ్నించారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పై ఈటల రాజేందర్ దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి, టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజల ముందే చర్చిస్తాం అంటూ ఛాలెంజ్ చేశారు.

పోటాపోటీగా పాడి కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ పోస్టర్లు
ఇక ఈటల రాజేందర్ కావాలని తమను రెచ్చగొడుతున్నారని, చర్చకు తాము వెనకాడబోమని తేల్చిచెప్పారు. పాడి కౌశిక్ రెడ్డి విసిరిన సవాల్ కు సై అన్న ఈటల రాజేందర్ బహిరంగంగా తేల్చుకోవడానికి రెడీ అయ్యారు. దీంతో హుజురాబాద్ లో అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చ చేస్తామని చెప్పిన ప్రాంతమంతా ఇరు పార్టీలు జెండాలతో ముంచెత్తారు. ఈటల రాజేందర్ కు సవాల్ విసురుతూ పాడి కౌశిక్ రెడ్డి కి సంబంధించిన పోస్టర్ ను ఏర్పాటు చేశారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ వేస్తూ ఈటల రాజేందర్ ప్లెక్సీని బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేశారు.

హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ .. పోలీసుల ఎంట్రీ, నేతలు అరెస్ట్
నిన్నటికి నిన్న టిఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి చర్చ జరగడానికి వేదికను ఏర్పాటు చేసింది. ఇక బీజేపీ నేతలు తగ్గేదే లేదని ఆ ప్రాంతం లోకి వెళ్లి తమ సత్తా చాటాలని జెండాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో నిన్న చోటుచేసుకున్న ఉద్రిక్తత శాంతించింది. ఇక ఈ రోజు మళ్ళీ ఉద్రిక్తతలకు అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అయితే బిజెపి నేతలు పోలీసులు కావాలని బిజెపి నాయకులను అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ నేతల అరెస్ట్ లు, హౌస్ అరెస్ట్ లపై మండిపడుతున్న బీజేపీ
హుజురాబాద్లో అశాంతిని రాజేయడం కోసం టిఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో ప్రజల దృష్టి దానినుంచి మరల్చడం కోసం హుజురాబాద్లో అశాంతిని రాజేసి కుట్రలకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications