ప్రభుత్వం పెళ్లి కానుక, అర్హతలు ఖరారు - ఖాతాల్లో నిధులు..!!

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు నిర్ణయించింది. ప్రభుత్వం తాజాగా కార్మికుల కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి ఆర్దిక సాయం అందించేందుకు డిసైడ్ అయింది. ఇందు కోసం కొత్తగా పథకాన్ని ప్రవేశ పెట్టింది. కార్మికుల కుటుంబాల్లో ఆడపిల్ల వివాహానికి రూ 30 వేల ఆర్దిక సాయం అందించనుంది. ఈ పథకానికి అర్హతలను ప్రభుత్వం ఖరారు చేసింది.

కుమార్తెలకు వర్తింపు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా కార్మికుల కుమార్తెల వివాహానికి ప్రభుత్వం ఆర్దిక సాయం అందించనుంది. వివాహం కోసం రూ 30 వేలు కార్మిక కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఈ పథకం అమలుకు నిబంధనలను ఖరారు చేసింది. తొలిసారి పెళ్లి చేసుకున్నవారికే మాత్రమే ఈ పథకం అమలవుతుంది.పెళ్లి జరిగిన తేదీ నుంచి ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్దేశించింది.

TG Govt to implement marriage gift for Building workers daughters details here

విధి విధానాలు
అయితే, దరఖాస్తు చేసుకునే వారి పేరెంట్స్ లో ఒకరు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలిలో సభ్యుడిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఇద్దరు కుమార్తెల వివాహాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేసారు. అదే విధంగా పెళ్లి జరిగేనాటికి కార్మికుల కుమార్తెకు 18 సంవత్సరాలు దాటి ఉండాలి. కార్మికురాలి వివాహం అయితే..దరఖాస్తుదారురాలు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.

దరఖాస్తు విధానం
ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు తమ పాస్ పోర్టు సైజ్ ఫొటోతో పాటుగా భవన నిర్మాణ కార్మికుడి గుర్తింపు కార్డ్, తమ కుమార్తె వయసు ధ్రువీకరణ పత్రం,ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ అదే విధంగా వివాహ ఆహ్వాన పత్రిక జత చేయాలి. వివాహ వేడుక ఫొటోలు సైతం అందించాల్సి ఉంటుంది. వివాహ ధ్రువీకరణ పత్రం, రెన్యూవల్ చలానా కాపీ, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్​ లతో అధికారిక వెబ్ సైట్ లో మ్యారేజీ గిఫ్ట్ స్కీం లో నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+