TG: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ నెంబర్ ప్లేట్ మార్పు

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్(TS) కాకుండా టీజీ(TG)గా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాల నెంబరు ప్లేట్లు మారాయి. టీఎస్ పేరుతో ఉన్న నెంబర్ ప్లేట్లను సెక్యూరిటీ సిబ్బంది తొలగించి టీజీ పేరుతో ఉన్న నెంబర్ ప్లేట్లను వాహనాలకు పెట్టారు.

తెలంగాణలో శుక్రవారం(మార్చి 15) నుంచి వాహనాల నెంబర్ ప్లేట్లను టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని కార్ల వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలకు భిన్నంగా టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లు చేపట్టిందని సీఎం రేవంత్ తోపాటు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

TG registration for new vehicles in telangana from today cm revanth reddy s convoy vehicles name plate changed

తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు మొదలు సామాన్య ప్రజలు టీజీ పేరును ఉపయోగించారని గుర్తు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీఎస్ స్థానంలో టీజీని మార్చింది. ఫిబ్రవరిలో రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వాహనాల నంబర్ ప్లేట్లలో టీఎస్​ స్థానంలో టీజీని మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మార్చి 12న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వెహికల్​ యాక్ట్​-1988లోని సెక్షన్ 41 (6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. గత ప్రకటనలోని టేబుల్లో సీరియల్ నంబర్ 29ఏ కింద తెలంగాణకు ఇదివరకున్న టీఎస్​ స్థానంలో టీజీ మార్క్ కేటాయించినట్లు కేంద్రం పేర్కొంది.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నడుపుతున్న వాహనాల నంబర్ ప్లేట్లలో ఎలాంటి మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి టీఎస్ పేరిట రిజిస్ట్రేషన్‌ అవుతూ వస్తుండగా.. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో టీజీ పేరుతో రిజిస్ట్రేషన్‌ కానున్నాయి. అయితే, పాత వాహనాలకు టీఎస్​ పేరు మీదే కొనసాగుతాయని.. మోటారు వాహన యూనియన్ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+