న్యూ ఇయర్ వేళ మందుబాబులకు బంపరాఫర్ - తాగాక ఫ్రీగా ఇంటికి..!!
కొత్త సంవత్సర వేడుకలకు రంగం సిద్దం అవుతోంది. న్యూ ఇయర్ వేళ హోటళ్లు... రిసార్టుల్లో స్పెషల్ కార్యక్రమాలు ఏర్పాటు చేసాయి. ఇక మద్యం షాపులు భారీగా నిల్వలు ఆర్డర్లు చేసాయి. ప్రత్యేకంగా మందుబాబులు సెలబ్రేషన్స్ కు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో పోలీసులు గ్రేటర్ పరిధిలో ఆంక్షలు విధించారు. ముందస్తు హెచ్చరికలు చేసారు. కాగా... న్యూ ఇయర్ వేళ మందుబాబులను సురక్షితంగా.. ఫ్రీగా ఇంటి వద్దకు తీసుకెళ్లేందుకు ఇక ఆఫర్ అందుబాటులోకి వచ్చింది.
కొత్త సంవత్సర వేడుకలకు అందరూ సిద్దం అవుతున్నారు. మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో సాధారణంగా మందు వినియోగం ఎక్కువగా ఉంటుంది. మద్యం సేవించి ఆ మత్తులో స్వయంగా ఇంటికి వెళ్లలేని వారు తమకు కాల్ చేస్తే ఉచితంగా ఇంటికి చేరవేస్తామని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్స్ వర్కర్స్ యూనియన్ ( టీజీపీడబ్ల్యుయూ) వెల్లడించింది. ఈ నెంబర్ 8977009804 కు కాల్ చేస్తే ఉచిత రైడ్ సౌకర్యాన్ని అందజేస్తామని స్పష్టం చేసింది. మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిరోధించ డమే లక్ష్యంగా ఈ ఉచిత రవాణా సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు వెల్లడించారు. వీరి కోసం డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.00 గంటల నుంచి జనవరి 1వ తేదీ రాత్రి 1.00 గంట వరకు ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.

ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. గత ఎనిమిదేళ్లుగా న్యూ ఇయర్ వేళ.. రాత్రుల్లో ఈ తరహా ఉచిత రైడ్స్ సేవలు అందిస్తున్నట్లు టీజీపీడబ్ల్యూయు గుర్తు చేసింది. మద్యం తాగి వాహనం నడపలేని వారి కోసం మొత్తం 500 వాహనాలు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పింది. అందుకోసం క్యాబ్‌లు, ఆటోలు, ఈవీ బైక్‌లు అందుబాటులో ఉంచినట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ పేర్కొంది. #HumAapkeSaathHai ప్రచారం కింద ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించింది. అటు పోలీసులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ ఆంక్షలు విధించారు. ఎవరైనా రోడ్ల పైన హద్దు మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే సమయంలో టీజీపీడబ్ల్యూయు ఆఫర్ మందుబాబులకు వరంగా మారనుంది.












Click it and Unblock the Notifications