TGSRTC: శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. ఆ సర్వీసులపై 10 శాతం రాయితీ..!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రభుత్వ ఆదేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఆర్టీసీ తన ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా కార్గో సేవలు కూడా మొదలు పెట్టింది. అలాగే పలు బస్ ప్రయాణాలపై రాయితీ కూడా ఇస్తోంది. అంతేకాకుండా వివాహాలు, విహారయాత్రలు, ఇతర శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తోంది.

అద్దె బస్సులకు సంబంధించి ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు అద్దెలపై ప్రత్యేక 10 శాతం రాయితీని ప్రకటించింది. ఈ రాయితీ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. గతంలో ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇయ్యాలంటే.. ఆర్టీసీ ముందస్తు డిపాజిట్ తీసుకునేది. ప్రస్తుతం ముందస్తు నగదు డిపాజిట్లను కూడా రద్దు చేసింది. ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకోవడం కోసం స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్లను సంప్రదించాలి. లేదా www.tgsrtconline.inలో అధికారిక TSRTC వెబ్‌సైట్‌ను సందర్శించి అద్దె బస్సులు బుక్ చేసుకోవచ్చు.

TGSRTC has announced a discount of 10 to those who rent RTC buses

కొద్ది రోజుల క్రితం ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా భారీ వర్షాలతో విజయవాడ అతలాకుతలమైంది. ఈ క్రమంలోనే ప్రయాణికులపై భారం తగ్గించేందుకు ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికుల కోసం 10 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మార్గంలో రాజధాని AC, సూపర్ లగ్జరీ బస్సులపై 10 శాతం డిస్కౌంట్ అందించింది.

ఆర్టీసీ ప్రకటించిన రాయితీతో ప్రయాణికులకు సుమారు రూ. 30 నుంచి రూ. 50 వరకు ఆదా అవుతుందని చెబుతున్నారు. అలాగే పండుగల సందర్భాల్లో ఆర్టీసీ లక్కీ డిప్ ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికులు తమ టికెట్లపై పేరు, ఫోన్ నంబర్ రాసి డబ్బాలో వేయాలి. ఆర్టీసీ నిర్ణయించిన తేదీలో డ్రా తీసి గెలిచిన వారికి బహుమతులు ఇచ్చింది. ఇలా కూడా ప్రయాణికుల సంఖ్య పెంచుకునేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+