ఆర్టీసీ "స్పెషల్" దోపిడీ - 50 శాతం ఛార్జీల పెంపు..!!
దసరా, బతుకమ్మ పండుగల వేళ ఆర్టీసీ ప్రయాణీకుల జేబులను ఖాళీ చేస్తోంది. పెద్ద పండుగ వేళ పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సొంత ప్రాంతాలకు వెళ్తారు. రద్దీ సైతం ఎక్కువగా ఉంటుంది. దీనిని సొమ్ము చేసుకునేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. పండుగ వేళ ప్రయాణీకుల కోసం స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తూనే..వాటిల్లో 50 శాతం మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. దీని పైన ప్రయాణీకులు ప్రభుత్వం..ఆర్టీసీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదనపు ఛార్జీలు
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులు పండుగ వేళ భారీ షాక్ ఇచ్చింది. గత ఏడాది దసరా వేళ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా.. సాధారణ ఛార్జీలనే వసూలు చేసారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. ఈ సమయంలో దసరా పండుగ వేళ ఆర్టీసీ ప్రకటించిన అదనపు బస్సుల్లో 50 శాతం మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. టికెట్ బేసిక్ ధరలో ఆర్టీసీ 50 శాతం పెంచింది. దీంతో ఛార్జీలు భారీగా పెరిగాయి.

రెగ్యులర్ సర్వీసుల స్థానంలో
హైదరాబాద్ నగరంలో నడిపే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులనూ ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో దూర ప్రాంతాలకు నడుపుతోంది. ఈ బస్సులు సిటీల్లో పరిమిత దూరం వరకు సౌకర్యంగా ఉంటాయి, కానీ వందల మీటర్ల దూర ప్రాంతాలకు నడుపుతున్న కారణంగా 50 శాతం అదనపు బాదుడుతో ఆర్టీసీ నడుపుతోంది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు అదనపు సర్వీసులను నడుపుతున్నారు. అయితే, రెగ్యులర్ సర్వీసులకూ అదనపు ఛార్జీలే వసూలు చేస్తున్నారు. అన్ని ప్రత్యేక బస్సులగానే నడుపుతుండటం పైన ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ గా తిరిగే సర్వీసులను సైతం అదనపు సర్వీసులుగా పేర్కొంటున్నారు.
ప్రయాణీకుల జేబులకు చిల్లు
సాధారణంగా డీలక్స్ కంటే సూపర్ లగ్జరీ బస్సుల ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రతీ డీలక్స్ బస్సును ప్రత్యేక బస్సుగా చెబుతుండటంతో..సూపర్ లగ్జరీ డీలక్స్ ధర చెల్లించాల్సి వస్తోంది. ఈ రోజు నుంచి ఆర్టీసీ హైదరాబాద్ నుంచి 1,041, 11న 1,341 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే రూట్లను ఖరారు ప్రకటించారు. అయితే..అటు రైళ్లు ఫుల్ అవ్వటం..ప్రయివేటు ఆపరేటర్ల తరహాలో తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు వసూలు చేయటం పైన ప్రయాణీకులు మండి పడుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications