ఉచిత ప్రయాణం, బస్సుల కష్టాలకు ఆర్టీసీ చెక్.. ఇక నుంచి..!!
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకం అమలు చేస్తోంది. ఇదే సమయంలో ప్రయాణీకులకు పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. అందులో భాగం గా తాజాగా గుగూల్ తో ఒప్పందం చేసుకుంది. ఉచిత బస్సుల తో సహా అన్ని రకాల సర్వీసుల సమాచారం ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు అందే విధంగా తాజా నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల సమాచారం సైతం ఇకపై 'గూగుల్ మ్యాప్స్'లో అందుబాటులోకి రానుంది. ఇందులో సిటీ బస్సులతో పాటు జిల్లా, అంతర్రాష్ట్ర బస్సుల వేళల సమాచారం కూడా యాప్ ద్వారా ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తున్నారు. బస్సుల రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులకు గూగుల్ మ్యాప్స్‌లో అందిస్తామని గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఇదే విషయాన్ని గూగుల్ ప్రతినిధి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని తాజాగా కలిసి దీనిపై చర్చించారు. ఆర్టీసీ బస్సులకు సంబంధించిన లైవ్ డేటాను గూగుల్‌కు షేర్ చేయాలని కోరారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించింది. ఐటీ శాఖ ద్వారా గూగుల్‌కు బస్సుల సమాచారాన్ని దీపావళి కల్లా అందించాలని నిర్దేశించారు.
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులకు జీపీఎస్ సౌకర్యం ఉంది. ఈ బస్సుల లైవ్‌డేటాను గూగుల్‌కు షేర్ చేయడం ద్వారా గూగుల్ మ్యాప్స్‌లోనూ బస్సుల కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది. 30 సెకన్లకోసారి బస్సు ఎక్కడుందో తాజా సమాచారం తెలుస్తుంది. కాగా, ఈ సేవలు ముందుగా సిటీ బస్సుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసుల సమాచారం కూడా ఇందులో ఉండాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
ఆర్టీసీలోని దాదాపు మొత్తం 9,500 బస్సుల లైవ్ డేటాను గూగుల్‌కు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గూగుల్ మ్యాప్స్‌లో ట్రాన్సిట్ (పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్) అనే సింబల్ కూడా ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనేది టైప్ చేయటం ద్వారా పూర్తి సమాచారం అందిస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం రద్దీ వేళ ఈ యాప్ ప్రయోజనకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications