అనాథల కోసం తెలంగాణ ప్రభుత్వం గొప్ప కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGS RTC) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఇతరులకు ఆనందాన్ని పంచాలనే గొప్ప ఆలోచనతో 'యాత్రాదానం' అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద, వ్యక్తులు లేదా సంస్థలు విరాళాలు ఇచ్చి అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ఉచితంగా యాత్రకు పంపవచ్చు.
పోస్టర్ ఆవిష్కరణ
ఈ వినూత్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో ఏళ్లుగా యాత్రలకు వెళ్లాలనే కోరిక ఉన్నవారికి ఇది ఒక వరంలాంటిదని అన్నారు. కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా ఈ యాత్ర నిధికి విరాళాలు ఇవ్వాలని కోరారు.

లక్ష్యం-ప్రయోజనం
ఈ యాత్రాదానం కార్యక్రమం కేవలం ఒక సామాజిక సేవ మాత్రమే కాదు, మానవత్వ విలువలను పెంపొందించే ఒక గొప్ప ప్రయత్నం అని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఈ యాత్రలు అనాథలు, వృద్ధులకు జీవితంలో మరపురాని అనుభూతిని ఇస్తాయని, ఆధ్యాత్మిక, సాంస్కృతిక అవగాహనను పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. వ్యక్తులు, కుటుంబాలు, ప్రజా ప్రతినిధులు, ఎన్ఆర్ఐలు, ఎన్జీవోలు వంటి వారు తమ సంతోషకరమైన రోజుల్లో ఈ మహత్తర కార్యంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
అందరికీ అందుబాటులోకి
ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి, టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను రూపొందించింది. దాతలు చెల్లించే విరాళాన్ని బట్టి ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులను సంస్థ ఏర్పాటు చేస్తుంది. యాత్రకు కనీసం వారం రోజుల ముందుగా స్థానిక ఆర్టీసీ డిపోలను సంప్రదించి బస్సులను బుక్ చేసుకోవచ్చు. లేదా హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చు.
మంత్రి, ఎండీల విరాళం
ఈ కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా, మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఎండీ సజ్జనర్ స్వయంగా చెరో లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. మంత్రి విరాళాన్ని అనాథలు, వృద్ధుల యాత్రకు వినియోగించగా, సజ్జనర్ విరాళాన్ని అక్షయ విద్యా ఫౌండేషన్ విద్యార్థుల విజ్ఞాన యాత్రకు ఉపయోగించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రారంభమైన ఈ యాత్రాదానం కార్యక్రమం సమాజానికి ఒక కొత్త దిశను చూపుతుందని చెప్పవచ్చు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications