మిస్‌ వరల్డ్‌-2025 విజేతగా థాయ్‌ లాండ్‌ సుందరి సుచాత చువాంగ్

మిస్‌ వరల్డ్‌-2025 విజేతగా థాయ్‌ లాండ్‌ సుందరి సుచాత చువాంగ్ శ్రీ నిలిచారు. మిస్‌ వరల్డ్‌-2025 కిరీటాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. దీంతో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్ కోవా.. 72వ మిస్ వరల్డ్ కిరీటాన్ని సుచాతా చువాంగ్‌ కు ధరించారు. ఇక 3వ రన్నరప్ గా మిస్‌ మార్టినిక్, 2వ రన్నరప్ గా మిస్‌ పోలాండ్,
1వ రన్నరప్ గా‌ మిస్‌ పోలెండ్‌ నిలిచారు.

హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయిలాండ్ కు చెందిన సుచాత చువాంగ్ శ్రీ చరిత్ర సృష్టించారు. మిస్‌ వరల్డ్‌-2025 విజేతగా నిలిచారు. మిస్‌ వరల్డ్‌ గా ఎంపికైన సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. థాయ్‌ లాండ్‌ లోని ఫుకెట్‌ అనే ప్రాంతంలో సుచాత జన్మించారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్‌ లు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

Thailand s Opal Suchata Crowned Miss World 2025 in Hyderabad

ఆమె తన 16 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు సుచాత చువాంగ్. అప్పటి నుంచి థాయి లాండ్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మిస్‌ వరల్డ్‌-2025 పోటీల్లో చరిత్ర సృష్టించిన సుచాత చువాంగ్ శ్రీ కి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఈ ఫైనల్ పోటీలకు సోనూ సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లండ్ కరీనా జడ్జిలుగా ఉన్నారు. మిస్ వరల్డ్ జడ్జిల ప్యానెల్ హెడ్‌ గా మిస్ వరల్డ్ సంస్థ ఛైర్మన్ జూలియా మోర్లీ ఉన్నారు. ఇక మిస్‌ వరల్డ్‌ జడ్జిల ప్యానెల్ ‌లో రానా దగ్గుబాటి,జయేశ్‌ రంజన్‌ కూడా ఉండటం విశేషం. ఇక సోనూసూద్ కు మిస్ వరల్డ్ హుమానిటేరియన్ అవార్డు లభించింది. ఈ అవార్డును టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సోనూసూద్ కు అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+