Medchal: యువకుడి బట్టలు విప్పి దారుణంగా కొట్టి చంపారు.. ప్రేమే కారణమా..!
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో దారుణం జరిగింది. తన కుమార్తెను వేరే కులం వ్యక్తి ప్రేమించడన్న కక్షతో బాలికు కుటుంబ సభ్యులు యువకుడిని హతమర్చారు. ఘట్ కేసర్ లోని అన్నోజిగూడ లక్ష్మీనరసింహా కాలనికి చెందిన కరణ్ నాయక్ అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కరణ్ నాయక్ తండ్రి చనిపోవడంతో అతను తల్లి యాదిబాయ్ తో స్థానికంగా నివాసం ఉంటున్నారు. కరణ్ నాయక్ కు అదే కాలనీలో ఉండే బాలికకు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
అయితే ఈ ప్రేమ విషయం బాలిక ఇంట్లో వాళ్లకి తెలిసింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో పాటు.. బాలికా మైనర్ గానే ఉంది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు కరణ్ నాయక్ ను మందలించారు. కొద్ది రోజులు బాగానే ఉన్నా తర్వాత మళ్లీ బాలికను కలవడం మొదలు పెట్టాడు. బాలిక కుటంబ సభ్యులు ఎన్నిసార్లు మందలించిన కరణ్ నాయక్ తీరు మారకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులకు ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలా కేసు పెడితే అల్లరి అవుతామని భావించారు.

ఈ క్రమంలోనే బుధవారం బాలిక తల్లిదండ్రులు స్థానికంగా ఓ పెళ్లికి వెళ్లారు. బాలిక ఒక్కరే ఇంట్లో ఉండడంతో కరణ్ నాయక్ బాలికి ఇంటికి వెళ్లాడు. అతను ఇంట్లోకి వెళ్లడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో పట్టరాని కోపంతో తల్లిదండ్రులు, స్థానికంగా ఉండే కొందరు కలిసి ఇంటికి గొళ్లేం పెట్టారు. ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించి కరణ్ నాయక్ ను తీవ్రంగా కొట్టారు. కరణ్ నాయక్ బట్టలు విప్పి నగ్నంగా తాళ్లతో కట్టేశారు. కర్రలతో దాడి చేశారు.
దాదాపు గంటపై కరణ్ నాయక్ విచక్షణరహితంగా కొట్టారు. దీంతో కరణ్ నాయక్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ తర్వాత చనిపోయాడు. దీంతో స్థానికులు పోలీసులు సమచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్నోజిగూడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
-
ఖాకీల నీడలో జూదశాల.. కీకారణ్యంలో కోట్ల దందా! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
శ్రీకృష్ణుడి అవతారమంటూ కామక్రీడలు: భక్తి ముసుగులో బలత్కారం! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
బెట్టింగ్ యాప్‌లకు బిగ్ షాక్… 300 ప్లాట్‌ఫామ్‌లు బ్లాక్ చేసిన ప్రభుత్వం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications