Loan Waiver: రుణ మాఫీ గైడ్ లైన్స్.. అర్హులు ఎవరంటే..!
తెలంగాణ ప్రభుత్వం రుణ మాఫీ చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. రుణమాఫీ గైడ్లైన్స్ రూపొందించడంపై కసరత్తు మొదలుపెట్టింది. ఆగస్టు 15లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఆగస్ట్ 15కు రెండు నెలల సమయమే ఉండడంతో నిధుల సర్దుబాటు, మార్గదర్శకాల రూపకల్పనపై అధికారులు దృష్టి పెట్టారు. వారం రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ అంశమే ప్రధాన ఎజెండాగా ఉంటుందని తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో రుణ మాఫీ మార్గదర్శకాలను ఫైనల్ చేయనున్నారు. అదే రోజు గైడ్ లైన్స్ విడుదల చేయనున్నారు. రుణ మాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపారు. రుణ మాఫీ చేయాలంటే కావాల్సి నిధులెన్నీ.. నిధులు ఎలా సేకరించాలి. సేకరించిన నిధులు తిరిగి ఎలా చెల్లించాలని సమీక్షించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఆ కార్పొరేషన్ కు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొస్తారు. ఆ నిధులను రైతుల ఖాతాల్లోకి మళ్లించి రుణ మాఫీ చేస్తారు. అయితే రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్ గా తీసుకోవాలి? అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలి? అనే దానిపై ఇంకా స్పష్టం రాలేదు. మంత్రివర్గంలో సమావేశంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకేసారి రైతు రుణ మాఫీ చేశారు.
అప్పుడు కేంద్రం నుంచి సాయం అందింది. ఇప్పుడు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు అందుకే తెలంగాణ ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో చేసిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, వాటి ఇంప్లిమెంట్ కు అనుసరించిన పద్ధతులను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల్లో.. అర్హుల ఎంపిక కోసం అనుసరిస్తున్న విధి విధానాలను, రుణమాఫీకి అమలు చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, రూ.10వేలకు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజినీర్లు రుణ మాఫీ చేయకుండా కేవలం రైతులకు మాత్రమే చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications