వీకెండ్స్‌లో షూటింగ్: ఆ సినిమా దర్శకుడు వరంగల్ కుర్రాడే...
సినిమాలపై ఆసక్తితో వంశీ అనే వరంగల్ యువకుడు లండన్‌లో పడమటి సంధ్యారాగం అనే సినిమా తీశాడు. వీకెండ్స్‌లో షూటింగ్ జరిపి, పూర్తి చేశాడు.
వరంగల్ : గణేష్ క్రియేషన్స్ బ్యానర్‌పై తాజాగా రూపొందించి విడుదలైన పడమటి సంధ్యారాగం లండన్‌లో చిత్ర దర్శకుడు మన హన్మకొండ పట్టణానికి చెందిన యువకుడే. హన్మకొండ టైలర్ స్ట్రీట్‌లో రాజేశ్వర్‌రావు-లలితా దంపతులకు 9 అక్టోబర్ 1983లో జన్మించిన ఆయనకు చిన్నప్పి నుంచే సినిమాలన్నా... సంగీతమన్నా.. ఎంతో ఇష్టం. ఎప్పికైనా ఓ సినిమాకు దర్శకత్వం వహించాలన్నది తన చిరకాల వాంఛ అని, అది ఈ సినిమాతో సఫలీకృతమైందని వంశీ చెప్పారు.

హన్మకొండలోని ఆల్ సైన్స్ స్కూల్లో హై స్కూల్ వరకు ఎస్సార్ కళాశాలలో ఇంటర్, జనగామలోని క్రీస్తు జ్యోతి కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఎటువిం సినిమా నేపథ్యం లేకున్నా.. సినిమాల మీద ఆసక్తితో నిరంతరం దానిగురించే ప్రయత్నాలు చేస్తూ దర్శకుడిని కాగలిగానని ఆయన చెప్పారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో కంప్యూటర్ అసోసియేషన్‌లో నాలుగేళ్లు పని చేసిన క్రమంలో సాఫ్ట్‌వేర్ జెల్సా పేరిట ఇంజనీరింగ్ సాఫ్ట్‌వేర్‌ల జీవన విశేషాలపై దర్శకుడిగా తాను రూపిందించిన డాక్యుమెంటరీ యూట్యూబ్ ద్వారా విశేష ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో తనకు కొంత ధైర్యమొచ్చిందన్నారు.
ఓ సీరియల్‌లో నటుడిగా ఒకసారి అవకాశం వస్తే దర్శకత్వాన్ని పరీక్షిస్తూ కొంత అవగాహన పెంచుకున్నానన్నారు. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా లండన్ వెళ్లి పోయానన్నారు. అక్కడ ఒక టీవీ ఛానల్‌లో పని చేశానన్నారు. అక్కడి తెలుగు వారు, తెలుగు అసోసియేషన్‌తో పరిచయాల నేపథ్యంలో లండన్‌లో సాఫ్ట్‌వేర్ మిత్రుడు గణేష్‌తో పరిచయం 'పడమటి సంధ్యారాగం' సినిమాకు అంకురార్పణ జరిగిందన్నారు.

ఎన్‌ఆర్‌ఐ నేపధ్యంలో తను రాసుకున్న కథ గణేష్‌కు చెప్పడం ఆయన వెంటనే ఒప్పుకోవడం, మరో ఐదుగురు మిత్రులు చైతు శాంతారాం, రమేష్, ఈసంపల్లి, ధీరజ్ కోట, సలాం యూసుఫ్, ఫిరోజ్‌షేక్‌లతో కలిసి ఈ సినిమా రూ. కోటి బడ్డ్‌ెతో తీశామన్నారు. ఈ చిత్రానికి తాను కథ, మాటలతో పాటు పూర్తిగా దర్శకత్వం వహించినట్లు చెప్పారు. అంతేగాక రెండు పాటలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశానన్నారు.పూర్తిగా లండన్‌లో కేవలం వీకెండ్స్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేశామన్నారు. ఈ సినిమా ద్వారా 50 మంది బ్రిటిష్ తెలుగు నటులను వెండి తెరకు పరిచయం చేస్తున్నట్లు చెప్పారు.
పూర్తి తెలుగుదనంతో...
కథానుగుణంగా పూర్తి తెలుగుదనం ఉట్టిపడేలా ఈ సినిమా ఉంటుందన్నారు. ప్రవాస తెలుగువారి జీవన శైలిని ఇతి వృత్తంగా తీసుకొని కాలానుగుణంగా ఇండియాలో, బ్రిటన్‌లో మారుతున్న సంస్కృతి సంప్రదాయాల నేపథ్యంలో చక్కని ప్రేమకథను జోడించామని, కథనానికి తగిన చక్కని సాహిత్యంతో ఏడు పాటలు ఉంాయన్నారు. హీరోగా చైతు శాంతారాం, హీరోయిన్‌గా షహీలా రాణితోపాటు ముఖ్య పాత్రలో లండన్ గణేష్ ఇంకా హీరో ఆకాష్, సూర్య, ధన్‌రాజ్ లాిం వారిని కూడా తీసుకొని సినిమా రూపొందించామన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications