సినిమా వాళ్లంతా గొంతు చించుకుంటున్నారు... ఆ కుటుంబం కనపడటంలేదా?
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి(35) అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె తొమ్మిది సంవత్సరాల కుమారుడు శ్రీతేజ ప్రస్తుతం ఆసుపత్రిలో 11 రోజుల నుంచి వెంటిలేటర్ పై ఉన్నాడు. ప్రస్తుతానికి పర్వాలేదని వైద్యులు చెబుతున్నారుకానీ వెంటిలేటర్ మాత్రం తీయలేదు. రేవతి భర్త భాస్కర్, ఇతర కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆయన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పై శనివారం ఉదయం విడుదలయ్యారు. చట్టానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.
ఆ కుటుంబం గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు
ఈ మొత్తం ఎపిసోడ్ లో సినీ పరిశ్రమలో ఉన్నవారంతా అల్లు అర్జున్ కు మద్దతుగా నిలబడ్డారు. ఉప్పు నిప్పుగా ఉన్న మెగా, అల్లు కుటుంబాలు కూడా కలిసిపోయాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. కథానాయకుడు నాని అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. పరిశ్రమలోని ఇతర సెలబ్రిటీలంతా మాట్లాడుతున్నారు. కానీ వారందరికీ మరణించి రేవతికానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడుకానీ, రేవతి భర్త, కూతురు, రేవతి తల్లిదండ్రులు.. వీరెవరూ గుర్తుకు రావడంలేదు. వారందరికీ అల్లు అర్జున్ ఒక్కడే గుర్తుకు వస్తున్నాడు. సినీ పరిశ్రమలో ఒక్క సెలబ్రిటీ కూడా ఆ కుటుంబానికి కనీసం మద్దతు తెలియజేయలేదు.. మాట్లాడలేదు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం మాత్రం నాగార్జునసాగర్ డ్యాం కొట్టుకుపోయిన హడావిడి చేస్తున్నారు.

చట్టం ప్రకారమే ముందుకు వెళ్లారు
చట్టం ప్రకారమే పనిచేసుకుంటూ వెళ్లామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బన్నీ భార్య స్నేహా రెడ్డి కుటుంబంతో తనకు బంధుత్వం కూడా ఉందని చెప్పారు. కానీ ఎవరూ మరణించి రేవతి కుటుంబం గురించి ఆలోచించడంలేదని, ఇది విచారకరమన్నారు. పుష్ప2తో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ను తెచ్చుకున్న అల్లు అర్జున్ రూ.25 లక్షల పరిహారం ఆ కుటుంబానికి ప్రకటించారు. తన ప్రమేయం లేకుండానే రేవతి మరణించినప్పటికీ పరోక్షంగా తాను కారకుడయ్యాడనే చిన్న బాధ, లేదంటే పెద్ద బాధ ఆయనకు ఉండొచ్చు. పుష్ప2 సినిమాకు రూ.300 కోట్ల పారితోషికం తీసుకున్న అల్లు అర్జున్ కనీసం ఆ కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించినా బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చట్టానికి కట్టుబడి ఉంటానని ప్రకటించడం మాత్రం అందరూ ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా హీరోలు ఓపెన్ టాప్ జీపుల్లో రాజకీయ నాయకుల్లా అభివాదం చేసుకుంటూ వెళ్లడం మానుకోవాలని, రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలను విడిచిపెట్టాలని, తమను ఇంతవారిని చేసిన అభిమానుల కోసమే సమాజ సేవ చేయాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.
గా ఆ కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే అల్లు అర్జున్ తరఫు లాయరు నిరంజన్ రెడ్డి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని చాలా అత్యవసరంగా విచారించాలంటూ కోర్టుకు విన్నవించారు. అత్యవసర పిటిషన్ అయినప్పుడు ఉదయం 10.30 గంటలకే మెన్షన్ చేయాలికదా అని కోర్టు నిరంజన్ రెడ్డిని ప్రశ్నించింది.
మధ్యాహ్నం పిటిషన్ విచారించాలనడం సబబు కాదు
పిటిషన్ ను బుధవారమే మెన్షన్ చేశామని, క్వాష్ పిటిషన్ వేశామని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై న్యాయస్థానం స్పందించి ఈ పిటిషన్ ను సోమవారం విచారిస్తామని చెప్పింది. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన దృష్ట్యా దీన్ని లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించాలంటూ పిటిషనర్ తరఫు లాయరు కోర్టును కోరారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లంచ్ మోషన్ పిటిషన్ విచారంటూ కోరడం సరైన చర్య కాదని ప్రభుత్వం తరఫు లాయరు కోర్టు దృష్టికి తెచ్చారు. లాయరు నిరంజన్ రెడ్డి మాత్రం సోమవారం వరకు ఈ కేసులో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు. అయితే పోలీసుల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వాటిని కోర్టుకు తెలియపరుస్తామని ప్రభుత్వ తరఫు లాయరు కోర్టుకు తెలిపారు.
చిరంజీవిని రావొద్దన్న పోలీసులు
అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో స్టేషన్ దగ్గరకు అతని తండ్రి అల్లు అరవింద్, బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు, ఇతర ప్రముఖులంతా తరలివచ్చారు. లంచ్ మోషన్ పిటిషన్ 1.30 గంటలకు స్వీకరించాలనడంలో అర్థం లేదని కోర్టు వ్యాఖ్యానించడంతో ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. కేసులో పోలీసులు బన్నీకి స్టేషన్ బెయిల్ ఇస్తారా? లేదంటే రిమాండ్ కు తరలిస్తారా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై సాయంత్రానికి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్టేషన్ దగ్గరకు చిరంజీవి రానున్నారనే సమాచారం తెలుసుకున్న చిరంజీవిని పోలీసులు రావొద్దని కోరారు. అభిమానులు కూడా వస్తే తమపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, భద్రతా ఏర్పాట్లు కష్టమవుతుందని చెప్పడంతో ఆయన స్టేషన్ కు రావడం మానుకున్నారు.












Click it and Unblock the Notifications