రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఫలించిన నిరీక్షణ, ఖాతాల్లో నగదు జమ..!!

తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో కీలక అప్డేట్ అందించింది. ఎన్నికల హామీని అమలు చేస్తోంది. సన్న వడ్ల బోనస్ పంపిణీని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నట్లు అధికారులు వెల్లడించారు. సన్న రకాలు సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధరకి అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం రూ.649.84 కోట్ల నిధులను విడుదల చేసింది.

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీ అమలు ప్రారంభించింది. ఈ మేరకు రైతులకు ఇప్పటికే నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. సన్నబియ్యం సాగు చేసిన 2,49,406 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో బోనస్ మొత్తం జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో రోజుకు 11.45 లక్షల మంది రైతులు 59.74 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లు తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖల సమన్వయంతో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకా నగదు జమ కాని రైతుల ఖాతాల్లో సోమవారం నుంచి మిగిలిన మొత్తం జమ కానుంది.

the-government-credited-500-bonus-per-quintal-for-fine-rice-cultivated-by-farmers

ఇప్పటికే ఈ బోనస్ చెల్లింపు పైన ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం రకాలను సాగు చేసి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుంది. ధాన్యంలో తేమ శాతం, గింజల నాణ్యత ఆధారంగా బోనస్ అర్హతను ఖరారు చేస్తారు. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత వారి వివరాలను పరిశీలించి, నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేస్తారు. కొంతకాలంగా బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళనతో ఉన్నారు. కాగా, ఇప్పుడు నిధులు విడుదల చేయటంతో పంట పెట్టుబడి భారీగా పెరిగిన పరిస్థితుల్లో క్వింటాకు అదనంగా రూ.500 రైతులకు పెద్ద ఊతంగా మారనుంది. సోమవారం నుంచి రైతుల ఖాతాలో నగదు జమ కాకపోతే రైతులు .. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+