గ్రేటర్ ఎన్నికల వేళ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం..!!

గ్రేటర్ హైదరాబాద్ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే విధంగా విస్తరించాలని భావిస్తోంది. ఇందు కోసం కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా ఏకంగా ఏడు కార్పోరేషన్లు .. 20 మున్సిపాల్టీలను గ్రేటర్ లో విలీనం చేసేందుకు సిద్దమైన ప్రతిపాదనల పై ప్రభుత్వ ఆమోద ముద్ర వేయనుంది. గ్రేటర్ ఎన్నికలు సైతం వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఏడాది లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు.

గ్రేటర్ పరిధి పెంపు
ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ కు కొత్త రూపు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​(జీహెచ్​ఎంసీ) పరిధిని ఓఆర్​ఆర్​ వరకు విస్తరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందు కోసం కమిటీ ఏర్పాటు చేయనుంది. నగర పరిధిని విస్తరించి మత్తంగా ఒకటే మెగా కార్పొరేషన్​ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తొలుత ఆలోచన చేసింది. అదే సమయంలో గ్రేటర్ ను మూడు కార్పోరేషన్లుగా ఏర్పాటు ప్రతిపాదన పైన చర్చలు జరిగాయి. ఇప్పుడు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి.. నివేదిక కోరనుంది. ఆ కమిటీ చేసే సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనుంది.

The govt will merge 7 coporations and 204 municipalities into the GHMC for equitable development

గ్రేటర్ లో విలీనం
జీహెచ్‌ఎంసీని మినహాయిస్తే ఓఆర్‌ఆర్‌ లోపల 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. ఓఆర్‌ఆర్‌ వరకూ నగరాన్ని ఒకేవిధంగా అభివృద్ధి చేసేందుకు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేష న్లను జీహెచ్‌ఎంసీలో విలీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీంతో, గ్రేటర్ పరిధి రెండు వేల కిలో మీటర్ల వరకూ ఉంటుంది. ఈ ప్రతిపాదన అమలులో కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చేసిన సూచనతో విలీనం తరువాత గ్రేటర్ ను మూడు కార్పోరేషన్ల ప్రతిపా దన తెర మీదకు వచ్చింది. ఇది అమలు చేయాలంటే ముందుగా సంబంధింత కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల్లో తీర్మానం చేయాలి. కానీ, వాటిల్లో కాంగ్రెస్ కు మెజార్టీ లేదు. ఇదే సమయంలో వీటి పాలకవర్గాల గడువు ముగియనుంది. ఎన్నికల అంశం చర్చకు వస్తుంది.

ఎన్నికలు వాయిదా
దీంతో, ఎన్నికలను వాయిదా వేసి కమిటీ ద్వారా వీటి విలీనం పైన నివేదిక కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కమిటీ నివేదిక ఇవ్వడానికి కనీసం సంవత్సరం పడుతుందని, ఈలోపు జీహెచ్‌ఎం సీ గడువు ముగియనుంది. అదే సమయంలో శివారులోని స్థానిక సంస్థల విలీనం, జీహెచ్‌ఎంసీ విభజన అంశాలపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఆ తరువాతనే ఎన్నికలు నిర్వహించాలనే ది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+