సమ్మక్క, సారలమ్మల దయ.. ములుగు జిల్లాకు మహర్దశ!
తెలంగాణ కుంభమేళాగా భావించే, ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 జనవరి 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మేడారంలో కొలువైన సమ్మక్క, సారలమ్మలు గిరిజన దేవతలుగా ప్రసిద్ధి చెందారు. కోట్లాది మంది భక్తులు ప్రతి సమ్మక్క సారలమ్మ మహా జాతరకు మేడారానికి తరలివస్తారు.
ములుగు జిల్లాకు వరాలు
రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మహా జాతర సందర్భంగా ఇప్పటివరకు ప్రతిసారి తాత్కాలిక ప్రాతిపదికన జాతర ఏర్పాట్లు చేసేవారు. అయితే ప్రస్తుతం శాశ్వత ప్రాతిపదికన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లను చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ములుగు జిల్లాకు వరాలను ప్రకటించింది. సమ్మక్క సారలమ్మల దయతో ములుగు జిల్లాకు మహర్దశ పట్టబోతుంది.

జిల్లాలో రెండు కొత్త బస్ స్టాండ్ లు, కొత్త బస్ డిపో
తెలంగాణ ఆర్టీసీ ములుగు జిల్లాలో శాశ్వత ప్రాతిపదికన, తాత్కాలిక ప్రాతిపదికన అనేక ఏర్పాట్లు చేస్తోంది. రవాణా రద్దీని తగ్గించి భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించడానికి tgsrtc యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో రెండు కొత్త బస్టాండ్లు, ఒక ఆర్టీసీ బస్ డిపో నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏటూరునాగారం లో 5.91కోట్ల రూపాయల వ్యయంతో 3.79 ఎకరాల విస్తీర్ణంలో కొత్త బస్ డిపో నిర్మాణం జరుగుతోంది.
కోట్ల రూపాయలతో నిర్మాణాలు
ప్రస్తుతం ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. ప్లింత్ బీమ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ కొత్త డిపో అందుబాటులోకి వస్తే మేడారం ఏటూరునాగారం వంటి కీలక ప్రాంతాలకు రవాణా సేవలు బాగా మెరుగుపడతాయి. ఇక ములుగులో ఉన్నటువంటి పాత బస్టాండ్ ను కూడా కూల్చివేసి 4.8 కోట్ల రూపాయల ఖర్చుతో నూతన ఆధునిక బస్టాండ్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
మేడారంలో బస్ స్టాండ్
మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల కోసం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంతానికి సమీపంలో వై జంక్షన్ వద్ద దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్ ను నిర్మిస్తున్నారు. ఈ బస్టాండ్ లో ఒకేసారి 3600 బస్సులను నిలిపేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయి. జాతర సమయంలో ప్రధాన రహదారుల మీద కిలోమీటర్లు మీరు ఏర్పడే ట్రాఫిక్ జామ్ లను తగ్గించడానికి ఈ బస్ స్టాండ్ కీలకం కానుంది.
ములుగు జిల్లాకు మహర్దశ
భక్తులను నేరుగా జాతర సమీపంలో దించి, అక్కడి నుంచి తిరుగు ప్రయాణం జరిగేలా చూడడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం మహా జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో ఆర్టీసీ చేపడుతున్న ఈ చర్యలతో ఆ పరిసర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగు కానున్నాయి. రవాణా సౌకర్యాల మెరుగుదలతో ములుగు జిల్లాకు మహర్దశ పట్టనుంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications