Monsoons: చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ.. ఇక వర్షాలే వర్షాలు..!
తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రెండు, మూడు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఆదివారం సాయింత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో చాలా చోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.సుచిత్ర, కొంపల్లి, చింతల్, సూరారాం, బాలానగర్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, ప్యాట్నీ ప్యారడైజ్, బేగంపేట్, ముషీరాబాద్, చిక్కడపల్లి, కవాడిగూడ, దోమలగూడ, ఉప్పల్, రామాంతపూర్, బోడుప్పల్, మేడిపల్లిలో వాన పడింది.
జిల్లాల్లో కూడా వాన కొట్టింది. మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో గుండి వాగు వద్ద ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లో భారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం పడింది. మరో రెండు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.

అయితే ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్నారు. సోమవారం కాస్త ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అటు ఏపీలో రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమలో నైరుతిరుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాలు కురుస్తున్నాయి.
కర్నూలు జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది.
రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications