Rains: శనివారం నుంచి తగ్గుముఖం పట్టనున్న వర్షాలు.. కానీ..!
భారీ వర్షాలతో సతమతమవుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ ఇక వర్షాలు తగ్గే అవకాశం ఉందని ప్రకటించింది. శుక్రవారం ఉదయం తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడిందని పేర్కొంది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉందని వెల్లడించింది. ఈ రోజు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలప్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్ కు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

తెలంగాణ రుతుపవనాల ప్రభావం అధికంగా ఉందని.. మరో అల్పపీడనం ఏర్పడితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శనివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణలో గత మూడు రోజులు విస్తారంగ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అత్యంత భారీ వర్షాలు కురిశాయి. వరంగల్, హనుమకొండ, మహబుబాబాద్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదు అయ్యాయి. మిగతా ప్రాంతాల్లో కూడా భారీ వానలు పడ్డాయి.
ఆగస్ట్, సెప్టెంబర్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. జులై 29, 30, 31 ఎలాంటి హెచ్చరికలు లేవని ప్రకటించింది. తెలంగాణలో 10 రోజుల ముందు వరకు వర్షపాత లోటు కనిపించింది. కానీ ఇప్పుడు అధిక వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాలతో తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.












Click it and Unblock the Notifications