ఆ వందేభారత్ రైళ్లల్లో ఇకనుంచి కనీస ఛార్జి రూ.30

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లు ప్రయాణికుల ఆదరణ చూరగొంటున్నప్పటికీ టికెట్ ఛార్జీలు మాత్రం చాలా చాలా అధికంగా ఉన్నాయంటూ ఫిర్యాదులు వస్తున్నాయికానీ వీటిని తగ్గించే యోచనలో మాత్రం భారతీయ రైల్వే లేదు. దీంతో క్రమంగా ప్రయాణికులే అలవాటుపడుతున్నారు. సాధారణ రైళ్లమీద నాలుగు రెట్లు అధికంగా టికెట్ ధరలు ఉంటున్నాయి. ఆ రైళ్లకు, ఈ రైళ్లకు గమ్యస్థానానికి చేరే విషయంలో తేడా గంట నుంచి గంటన్నర ఉంటోంది. ఈ సమయానికే అంత వెచ్చించాలా అంటూ చాలామంది సాధారణ రైళ్లనే ఆశ్రయిస్తున్నారు.

పరుగులు తీయనున్న నమో భారత్ రైళ్లు
ఈ క్రమంలో వందే మెట్రో రైళ్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. వీటిని నమో భారత్ రైళ్లుగా పిలుస్తున్నారు. కేరళ రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఏకంగా 10 వందే మెట్రో రైళ్లను కేటాయించింది. అత్యాధునిక సౌకర్యాలున్న ఈ రైళ్లు రాష్ట్ర పర్యాటకాన్ని పరుగులు పెట్టిస్తాయని భావిస్తున్నారు. మొత్తం పది సర్వీసు రైళ్లల్లో కొల్లం నుంచి తిరునల్వేలికి రెండు, త్రిస్సూరుకు రెండు నడవనున్నాయి. అలాగే త్రిస్సూరు నుంచి గురువాయూరు వరకు పొడిగించి నడపాలనే ప్రతిపాదనలున్నాయి. అలాగే ఎర్నాకులం నుంచి తిరువనంతపురం, గురువాయూరు నుంచి మధురై వరకు నమో భారత్ (వందే మెట్రో) రైళ్లు నడవబోతున్నాయి. 100 నుంచి 250 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతాల మధ్య ఇవి నడుస్తాయి.

The minimum fare of Namo Bharat trains being introduced in Kerala is 30 rupees

కనీస ఛార్జీగా రూ.30ని నిర్ణయించారు
వీటిల్లో కనీస టికెట్ ఛార్జీని కేవలం రూ.30గా నిర్ణయించారు. అలాగే నెలవారీ పాసులు కూడా ఇవ్వబోతున్నారు. 20 సార్లు సింగిల్ గా ప్రయాణిచేస్తే ఎంత ఛార్జీ పడుతుందో నెలమొత్తం మీద అంతే తీసుకోబోతున్నారు. పర్యాటకు ప్రాంతాలను అనుసంధానం చేయడంతోపాటు అన్ని పర్యాటక ప్రాంతాలను ఈ పది వందే మెట్రో రైళ్లు కవర్ చేస్తాయి. కొండలు, అడవులు, బ్యాక్ వాటర్, తీర ప్రాంతాలు, పడవ పందాలు, కొబ్బరితోటలు.. కుస్తీ పోటీలు, కేరళ సాంప్రదాయ పోటీలు.. తదితరాలను ఆకర్షించే అవకాశం కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. కొల్లంకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. చిన్న చిన్న స్టేషన్లలో కూడా హాల్టింగ్ ఇవ్వబోతున్నారు. కొల్లంలో నమో భారత్ రైళ్లు అడుగు పెట్టిన తర్వాత కేరళ పర్యాటకం భారతీయులందరినీ ఆకర్షిస్తుందని, తద్వారా తమకు ఆదాయం పెరుగుతుందని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గ సౌకర్యాలను ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమైవుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+