TGSRTC: ప్రయాణికుడికి ఫిట్స్.. ఆర్టీసీ బస్ డ్రైవర్ ఏం చేశాడంటే..!
ఆర్టీసీ సిబ్బంది మరోసారి మానవత్వం చాటుకున్నారు. తాజాగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులో ఫిట్స్ వచ్చిన ప్రయాణికుడిని ఆస్పత్రిలో చేర్పించి ఓ డ్రైవర్ ఉదారత చాటుకున్నారు. బస్సును నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. దీంతో డ్రైవర్ పై ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు. సోమవారం వరంగల్-2 డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి హన్మకొండకు బయల్దేరింది. హైదరాబాద్ శివారు ఘట్ కేసర్ దాటగానే సంతోష్ అనే ప్రయాణికుడికి బస్సులో ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది.
గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్ బి.వెంకన్నకు విషయాన్ని వివరించారు. వెంకన్నవెంటేనే బస్సును పక్కకి ఆపారు. ఫిట్స్ వచ్చిన సంతోష్ వద్దకు వెళ్లాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో తోటి ప్రయాణికుడు శ్రీనివాస్ సహకారంతో సమీపంలో ఉన్న బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి బస్సును తీసుకెళ్లారు. సంతోష్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో సంతోష్ ప్రాణాలతో బయటపడ్డారు.

సమయస్పూర్తితో వ్యవహారించి సకాలంలో ప్రయాణికుడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆర్టీసీ డ్రైవర్ బి.వెంకన్నను హైదరాబాద్ బస్ భవన్ లో మంగళవారం టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి ఆయనను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సన్మానించారు. ఆపద సమయంలో అమూల్యమైన సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతున్నారని సజ్జనర్ అన్నారు.
ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తున్నారని ప్రశంసించారు. సంతోష్‌ను ఆస్పత్రికి తరలించడంలో డ్రైవర్‌కి సహకరించిన ప్రయాణికుడు శ్రీనివాస్‌కు, వైద్యం అందించిన ఎయిమ్స్ వైద్య బృందానికి అభినందనలు తెలిపారు.
#TGSRTC బస్సులో ఫిట్స్ వచ్చిన ప్రయాణికుడిని ఆస్పత్రిలో చేర్పించి డ్రైవర్ ఉదారత చాటుకున్నారు. బస్సును నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు.
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) August 13, 2024
వరంగల్-2 డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి హన్మకొండకు సోమవారం వెళ్తోంది. హైదరాబాద్… pic.twitter.com/ip7mllTdC8
ఈ సన్మాన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీదేవి, వరంగల్-2 డిపో మేనేజర్ జ్యోస్న, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications