Chicken: భారీగా తగ్గిన చికెన్ ధర.. కిలో ఎంతంటే..!

చాలా మందికి ముక్క లేనిదే బుక్క దిగదు. అయితే మటన్ ధర ఎక్కువ ఉంటుందని చాలా మంది చికెన్ తింటుంటారు. కొంత మంది మటన్ కంటే చికెన్ ను ఎక్కువగా ఇష్టపడతుంటారు. 20 రోజుల క్రితం చికెన్ ధర భారీగా పెరిగింది. అయితే భారీగా పెరిగిన ధరలు గతవారం నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో చికెన్ ప్రియులు హ్యాపీగా ఉన్నారు. తెలంగాణలో చికెన్ స్కిన్ లెస్ కిలో రూ.200 నుంచి రూ.210 పలుకు

చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్. గతవారం వరకు భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు తగ్గాయి. ఆదివారం వస్తే చాలు చాలా మంది నాన్ వేజ్ కావాల్సిందే. అలాంటి వారికి ఇది నిజంగా శుభావార్తేనని చెప్పాలి. ఏపీ, తెలంగాణలో కేజీ చికెన్ ధర స్కిన్‌లెస్ రూ.200 నుంచి రూ.210 ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ధరలు ఇంచుమించు ఇదే విధంగా ఉన్నాయి. అయితే వారం క్రితం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 280 నుంచి రూ.310 గా ఉంది.

The prices of chicken which have been reduced for a week have come down drastically

చికెన్ ధరలు తగ్గడానికి ఇరు రాష్ట్రాల్లో కోళ్ల లభ్యత పెరగడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయితే ఎండలు పెరిగితే చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎండ తీవ్రతకు కోళ్లు చనిపోతాయని అందుకే.. అప్పుడు కోళ్ల లభ్యత తక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు.నెల క్రితం ధరలు పెరగడానికి సమ్మక్క సారక్క జాతరతో పాటు నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ రావడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

కోడి గుడ్డు ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. గత డిసెంబర్ ఒక్కో కోడి గుడ్డు ధర రూ. 7 వరకు చేరింది. ఆ తర్వాత తగ్గింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్ లో ఒక్కో కోడి గుడ్డు రూ. 6 నుంచి రూ.6.50 పలుకుతోంది. హోల్ సేల్ లో ఒక్కో కోడి గుడ్డు రూ.5.50 నుంచి రూ.6 పలుకుతోంది. అయితే చలికాలంలో గుడ్లు ఎక్కువ తింటారు కాబట్టి ధరలు పెరిగాయని చెబుతున్నారు. సమ్మర్ లో కోడి గుడ్డు వినియోగం తగ్గితే.. ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+