Holiday: సెప్టెంబర్ 7, 17న సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 7, 17న సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఇచ్చింది. గణేష్ చతుర్థి, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 17న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవు ఇచ్చింది. సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీ సెలవు ఉంది. అయితే దీన్ని సెప్టెంబర్ 17కు మార్చారు.
నెలవంక దర్శనం 17న కనిపించనుంది. దీంతో మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీని మార్చారు. వినాయక నిమజ్జనం రోజు కూడా సెలవు ప్రకటించింది. అయితే అదే రోజు మిలాన్ ఉన్ నబీ ఉంది. దీనికే సెలవు ప్రకటించారు. అదే రోజు జరిగే మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ర్యాలీ వాయిదా వేసినట్లు తెలిసింది. సెప్టెంబర్ 19న మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ర్యాలీ నిర్వహించే అవకాశం ఉంది. మొన్న సోమవారం కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం సెలవు ప్రకటించారు. అయితే ఈ సెలవును ఎప్పుడు కవర్ చేస్తారో చెప్పలేదు. కాగా వచ్చే నెలలో గాంధీ జయంతి, దసరా పండులకు సెలవులు ఉన్నాయి. విద్య సంస్థలకు బతుకమ్మ, దసరా పండుగకు వారం రోజులకు పైగా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications