ఉద్యోగులకు డీఏలు, బకాయిల చెల్లింపుపై కీలక నిర్ణయం..!!

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్దమైంది. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి కారణంగా ఉద్యోగులు.. పెన్షనర్లకు చెల్లించాల్సి ఉన్న బకాయిల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డు ఉద్యోగుల బెనిఫిట్ల తో పాటుగా పెండింగ్‌ చెల్లించడానికి ప్రభుత్వం ముందకొ చ్చింది. అదే విధంగా ఉద్యోగులకు రెండు డీఏలతో పాటుగా ఆరోగ్య పథకం ప్రకటించేలా
కసరత్తు జరుగుతోంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది.

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చింది. ఉద్యోగుల సమస్యల పై ఈ నెల 29న సమావేశాన్ని నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిత్తల్‌, పంచా యితీ ‌రాజ్‌ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌లతో ప్రభుత్వం సబ్‌-కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగులు లేవనెత్తిన సమస్యల గురించి సబ్‌-కమిటీ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. 29న సబ్‌-కమిటీ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలు, వాటి పరిష్కారంపై చర్చిచాలని నిర్ణయించారు.

the-tg-government-is-expected-to-release-one-of-the-pending-da-for-employees

భట్టితో భేటీ తర్వాత ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు కీలక అంశాలన వెల్లడించారు. ఉద్యోగులకు రూ.11 వేల కోట్ల బకాయిలు చెల్లిస్తామని ఉప ముఖ్యమం త్రి హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్)ను ప్రకటిస్తామని చెప్పారని వెల్ల డించారు. ఐదు డీఏలలో ఒకటి లేదా రెండింటిని అందజేస్తామని చెప్పారని వివరించారు. జూన్‌ 2న సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రకటన చేస్తారని చెప్పారు.

ఈ మేరకు జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఉద్యోగుల అంశాల పైన ప్రభుత్వం కీలక ప్రకటన దిశగా కసరత్తు జరుగుతోంది. ఉద్యోగులు చాలా కాలంగా నిరీక్షిస్తున్న ఆరోగ్య పథకం విధి విధానాల పైన ఉద్యోగ సంఘాల నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసారు. అదే విధంగా ఉద్యోగు సంఘాల విలీనం కు రంగం సిద్దమైంది. ఇక నుంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంఘాలన్నీ ఒకే జేఏసీ గా పని చేయాలని డిసైడ్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+