YS Sharmila: తాటి కల్లు తాగిన వైఎస్ షర్మిల.. వీడియో వైరల్..

ప్రజాప్రస్థాన యాత్రలో వైఎస్ షర్మిల తాటి కల్లు తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎఎస్ షర్మిల పాదయాత్ర జనగామ జిల్లా పాలకుర్తి చేరుకుంది. పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల గీత కార్మికుడి కోరిక మేరకు తాటి కల్లు రుచి చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షర్మిల పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఆమెకు ఓ గీత కార్మికుడు తారపడ్డారు. అతను నడుముకు మోకు కట్టుకుని, చేతిలో కల్లు లొట్టితో ఉన్నాడు. మేడం కాస్త కల్లు రుచి చూడండి అని అతను కోరగా.. ఆమె తాటి కల్లు రుచి చూశారు.

ఆ ఇద్దరి పాదయాత్ర

ఆ ఇద్దరి పాదయాత్ర

పాలకుర్తి నియోజకవర్గంలో షర్మల పాదయాత్రతో పాటు రేతవంత్ హాత్ సే హాత్ జోడో యాత్ర కూడా కొనసాగుతోంది. దీంతో నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవరుప్పుల మండలంలోని దుకాణాలను మూసివేయించారు. డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.కేసీఆర్ ను, కేసీఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చేస్తూనే మరోవైపు ఒకరిపై ఒకరు కూడా విమర్శలు చేసుకుంటూ ఉండడం ఆసక్తికరంగా మారింది.

ఆరోపణలు

ఆరోపణలు


ఇక ఇదే సమయంలో తాజాగా ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్లు ఒకే నియోజకవర్గంలో ఒకే చోట పాదయాత్ర చేయనుండడం ఇప్పుడు పోలీసులకు పెద్ద పని పెట్టింది. ఇప్పటికే వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్ర పేరును రేవంత్ రెడ్డి బ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది పాదయాత్రనో లేక దొంగ యాత్రనో అర్థం కావడం లేదని, ఆయన పాదయాత్ర పై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని విమర్శించిన వైఎస్ షర్మిల ఆయన పిలక కెసిఆర్ చేతిలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలీసుల నిఘా

ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్రలో మరేం మాటల తూటాలు పేలుతాయో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. నేడు వీరి పాదయాత్ర పాలకుర్తి నియోజకవర్గం లోకి ప్రవేశించడంతో ఇద్దరు ఒకే ప్రాంతంలో ఎదురుపడకుండా అవసరమైన చర్యలను పోలీసులు తీసుకుంటున్నారు. వారు పాదయాత్ర చేస్తున్న ప్రాంతాల్లో నిఘా పెంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+