SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో భయంకర పరిస్థితి, చూడండి

SLBC Tunnel: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్‌లో భయానక పరిస్థితులు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు కొనసాగుతోన్న సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు. లోకో ట్రైన్‌లో సొరంగం లోపలికి వెళ్లి వచ్చిన తర్వాత మంత్రి జూపల్లి మీడియాకు టన్నెల్ లోపలి పరిస్థితిని వివరించారు.

సొరంగంలో నీరు, బురద తోడేసే పనులు కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి తెలిపారు. సొరంగంలోకి ఆక్సిజన్ పంపుతున్నట్లు చెప్పారు. సహాయక బృందాలు శనివరాం రాత్రి నుంచి నిరంతరాయంగా పనిచేస్తున్నాయని జూపల్లి చెప్పారు. రెస్క్యూ టీంలు టన్నెల్ బోర్ మిషన్‌కు వెళ్లాయని తెలిపారు.

There are terrible conditions in the SLBC tunnel Minister Jupally Krishna Rao

అయితే, టన్నెల్ లోపల పరిస్థితి భయంకరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. నీటి ఉధృతికి బోరింగ్ మిషన్ కొట్టుకొచ్చిందన్నారు. అవసరమైన యంత్రాలు లోపలికి తీసుకెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

లోపల చిక్కుకున్న వారి నుంచి ఎలాంటి శబ్ధాలు రావడం లేదని మంత్రి జూపల్లి తెలిపారు. కార్మికుల విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. అయినా, వారిని కాపాడేందుకు చివరి వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

కాగా, ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలో నిమగ్నమయ్యాయి. మరోవైపు, సింగరేణి ఇంజినీర్లు, రెస్క్యూ టీంలు కూడా చేరుకున్నాయి.

కేంద్ర ప్రభుత్వం కూడా సొరంగంలో చిక్కుకున్నవారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఇప్పుడు భారత నావికా దళం కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+