రజాకార్ సినిమా నిర్మాతకు భద్రత కల్పించిన కేంద్ర హోంశాఖ: కారణం ఇదే

రజాకార్ (Razakar) నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి కేంద్ర హోంశాఖ భద్రత కల్పించింది. ఆయనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నారాయణ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణ రెడ్డికి భద్రతగా 1+1 సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో రూపొందిన సినిమా రజాకార్. రాజకీయంగా ఎన్నో వివాదాలకు కేంద్రంగా నిలిచిన ఈ చిత్రం అనేక అడ్డంకుల్ని దాటుకుని మార్చి 15న ప్రేక్షకుల ముందుకొచ్చంది. రజాకార్ల అరాచకాలను కళ్లకు గట్టినట్లు చూపారంటూ ఈ సినిమాపై పలువురు విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది.

threatening calls to the producer of razakar movie central security for Gudur Narayana Reddy

ఇది ఇలావుండగా, రజాకార్ చిత్ర యూనిట్ బుధవారం సిరిసిల్లలో పర్యటించింది. స్థానిక విమల్ థియేటర్‌లో ప్రేక్షకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు యాట సత్యనారాయణ మాట్లాడుతూ.. రజాకార్ సినిమాలో ఉన్నది మత చరిత్రగా వక్రీకరిస్తున్న విషయంలో వాస్తవం లేదన్నారు. ఇది మన గత చరిత్ర అని తెలిపారు.

పదేళ్లపాటు పరిశోధించి సేకరించిన సమాచారం ఆధారంగా స్క్రిప్ట్ తయారు చేసినట్లు సత్యనారాయణ చెప్పారు. నటి ఇంద్రజ తోపాటు చిత్ర యూనిట్ సభ్యలను బీజేపీ నేత ాడెపు రవీందర్, నాగుల శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత బొల్లి రామ్మోహన్, థియేటర్ మేనేజర్ రవి తదితరులు సత్కరించారు .

మరోవైపు, 'రజాకార్' సినిమా విష‌య‌మై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజ‌య్ ఓ లేఖ రాశారు. ఈ సినిమాకు వినోద‌పు ప‌న్ను నుంచి మిన‌హాయింపు ఇవ్వ‌డంతో పాటు స్కూల్‌, కాలేజీ విద్యార్థుల‌కు మూవీని చూపించాల‌ని బండి సంజ‌య్ త‌న లేఖ ద్వారా సీఏం రేవంత్‌ను కోరారు. ర‌జాకార్ల రాక్ష‌స పాల‌న‌లో తెలంగాణ ప్ర‌జ‌లు ప‌డ్డ బాధ‌ల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిన చిత్రం 'రజాకార్' అని పేర్కొన్నారు.

ఇలాంటి మంచి మూవీని తీసిన వారికి ప్ర‌భుత్వ‌ప‌రంగా ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని బండి సంజ‌య్ గుర్తు చేశారు. త‌ద్వారా ప్ర‌జ‌ల్లోకి మంచి సందేశం పంపిన‌ట్లవుతుంద‌ని చెప్పుకొచ్చారు. దీంతో నాటి మ‌హ‌నీయుల‌ను స్మ‌రించుకోవ‌డంతో పాటు వారి పోరాటాలు నేటి త‌రానికి స్ఫూర్తిగా నిలిచే అవ‌కాశం ఉంద‌న్నారు బండి సంజయ్. ప్ర‌భుత్వం వెంట‌నే క‌ల్పించుకుని ఇలాంటి సందేశాత్మ‌క చిత్రాల‌ను వీలైనంత ఎక్కువ థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బండి సంజ‌య్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+