4 ఏళ్లకే వరల్డ్ రికార్డ్.. ఈ బుడ్డోడు మామూలోడు కాదు..

ఈ కాలంలో పసిపిల్లలు సెల్ ఫోన్ లేనిదే ఎవరిమాటా వినరు. చేతిలో ఫోన్ పెడితేనే అన్నం తింటారు. ఫోన్ లో గేమ్స్, రీల్స్ చూడడం అంటే వాళ్లకు పిచ్చి. లేదంటే టీవీలో కార్టూన్ ఛానెల్స్ చూస్తారు. చెప్పినమాట వినకుండా అల్లరి చేస్తారు. కానీ ఓ 4 ఏళ్ల పిల్లాడు మాత్రం పిట్ట కొంచెం కూత గనం అన్నట్లుగా చిన్న వయసు నుంచే రికార్డులు నెలకొల్పుతున్నాడు. తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్ని చెరిపేస్తున్నాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ వండర్ కిడ్ ను తాజాగా ఓ న్యూస్ ఛానెల్ పలకరించింది.

మంచిర్యాల జిల్లాలోని హైటెక్ సిటీ ప్రాంతానికి చెందిన నామాని రమేష్ మౌనిక దంపతుల కుమారుడు నామాని రామ్ అక్షరేష్(4) అద్భుతాలు చేస్తున్నాడు. తన జ్ఞాపకశక్తితో అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. తల్లిదండ్రులు ఏం నేర్పించినా క్షణాల్లో అప్పజెప్పడమే కాకుండా ప్రపంచంలోని వింతలు, విశేషాల వివరాలను అక్షరం తప్పు లేకుండా చెప్తూ అందరిచేతా వావ్ అనిపించుకుంటున్నాడు. బాలుడి తల్లి మౌనిక ఓ యోగా టీచర్. అలాగే తండ్రి బిజినెస్ చేస్తుంటాడు. ఇక తల్లిదండ్రులు అక్షరేష్ లో స్కిల్స్ ను గుర్తించి ప్రోత్సహించారు. పేరెంట్స్ ఇచ్చిన సహకారంతో మరింత ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ జనరల్ నాలెడ్జ్ నేర్చుకున్నాడు. అలా పలు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.

Tiny Memory Marvel 4-Year-Old Aksharesh Enters International Wonder Book of Records

ప్రస్తుతం అక్షరేష్ వయసు 4 ఏళ్లు కాగా.. స్థానికంగా ఉన్న మాతృ మందిర స్కూల్ లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఇక ఈ బాలుడి టాలెంట్ విషయానికి వస్తే.. రాష్ట్రాలు, రాజధానులు, తెలుగు సంవత్సరాలు, తెలుగు తిథులు, జాతీయ చిహ్నాలు, రాష్ట్రాలకు సంబంధించిన గుర్తులు, గ్రహాలు, చారిత్రక కట్టడాలు.. లాంటివి ఏకధాటిగా చెబుతున్నాడు. ఈ నైపుణ్యంతో చిన్నవయసులోనే అనేక గిన్నిస్ రికార్డులను నెలకొల్పాడు. ఇటీవల ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు అక్షరేష్ ప్రతిభను గుర్తించి రికార్డు లో చోటు కల్పించారు. అలాగే ఘనంగా సత్కరించారు. ఇంత చిన్న వయసులోనే తమ బాబుకు ఇలాంటి గుర్తింపు రావడం తమకు ఆనందాన్ని ఇస్తుందని బాలుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+