తెలంగాణలో వర్షాలకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్

తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు మందకొడిగా సాగుతుండటమే దీనికి కారణమని, ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షాలు కురవకపోవచ్చని, మంగళవారం సాయంత్రం ఐదుగంటల తర్వాత తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపారు. ఈరోజు బలమైన ఈదురు గాలులు గంటకు 30 కిలోమీటర్ల వేగం నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీయొచ్చన్నారు.

గాలిలో తేమ శాతం లేదు
గాలిలో తేమ శాతం లేకపోవడంతో ఉక్కపోత ఉంటుందని, రాష్ట్రవ్యాప్తంగా 31 డిడ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని, నైరుతి రుతుపవనాల వల్ల జూన్ నెలలో ఆశించిన మేరకు వానలు కురవకపోవడమే దీనికి కారణమని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా, కొన్ని జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. జూన్ నెలకు సంబంధించి సాధారణ వర్షపాతం 12.94 సెంటీమీటర్లు కాగా ఈసారి 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

today and tomorrow weather updates in telangana state

11 జిల్లాలో ఎక్కువ వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో అధిక వర్షపాతం, 14 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 159 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 171 మండలాల్లో ఎక్కువ వర్షపాతం, 198 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 84 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని నైరుతి దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

మరో మూడు రోజులపాట రాష్ట్రంలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈదురు గాలులతో రెండురోజుల క్రితం అతి భారీ వర్షాలు కురిశాయి. రాబోయే మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+