నన్ను వాడుకుని వదిలేశాడు - గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్ద నటి నగ్నంగా బైఠాయింపు..!!
హైదరాబాద్: టాలీవుడ్ నటి బోయ సునీత కలకలం రేపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గుండెకాయగా చెప్పుకొనే జూబ్లీహిల్స్‌లో ఆందోళనకు దిగారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదురుగా.. నడిరోడ్డుపై నగ్నంగా బైఠాయించారు. ఈ ఘటన టాలీవుడ్‌లో సంచలనానికి దారి తీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కొంతకాలంగా బోయ సునీత.. బన్నీ వాసుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో పవన్ కల్యాణ్‌ను కూడా తప్పు పడుతున్నారు. బన్నీవాసు తనను మోసం చేశాడంటూ ఆరోపిస్తోన్నారు. ఇదివరకు కూడా చాలాసార్లు గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. గీతా ఆర్ట్స్ నుంచి గానీ, బన్నీ వాసు నుంచి గానీ ఎలాంటి హామీ లభించకపోవడంతో తన ఆందోళనను మరింత తీవ్రతరం చేశారని, ఇందులో భాగంగా నగ్నంగా బైఠాయించారని చెబుతున్నారు.

నడిరోడ్డుపై బైఠాయించిన ఆమె తనకు న్యాయం చేయాలంటూ గట్టిగా డిమాండ్ చేశారు. బన్నీ వాసును కలిసినప్పుడు గానీ మాయమాటలు చెబుతూ వచ్చారని విమర్శించారు. తనను మానసికంగా హింసిస్తోన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిలదీసి మాట్లాడితే అరెస్ట్ చేయిస్తామని, జైల్లో పెడతామంటూ బెదిరిస్తోన్నారని అన్నారు. చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. నాలుగు సార్లు ఎర్రగడ్డ మానసిక చికిత్స ఆసుపత్రికి వెళ్లొచ్చానని, బన్నీ వాసు పెడుతున్న టార్చర్‌కు తన నరాలు దెబ్బతిన్నాయని అన్నారు.
జూబ్లీహిల్స్ గీతా ఆర్ట్స్ ముందు నగ్నంగా నటి సునీత బోయ
— devipriya (@sairaaj44) November 17, 2022
బైఠాయింపు... pic.twitter.com/aXkHcyX0GZ
ఈ సమాచారం అందుకున్న వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. బోయ సునీతపై ఒంటిపై బట్టలు కప్పారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి తీసుకెళ్లారు. గతంలో నటి శ్రీరెడ్డి కూడా ఇదే తరహాలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద శ్రీరెడ్డి కూడా అర్థనగ్నంగా బైఠాయించి, తన నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications