టాలీవుడ్ హీరోల మద్దతెవరికి - ఎవరికి ఎక్కడ ఓటు..!!

తెలంగాణలో ఎన్నికల సంగ్రామంలో కీలక ఘటం ప్రారంభం కానుంది. రేపు తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు తుది దశకు చేరాయి. టాలీవుడ్ ప్రముఖులు ఈ సారి రాజకీయ వ్యూహాలను నిశితంగా గమనిస్తున్నారు. ఎవరికి మద్దతు ఇస్తారనేది గుంభనంగా ఉంది. అయితే, టాలీవుడ్ ప్రముఖులు ఓటింగ్ లో మాత్రం ప్రతీ సారి ముందు నిలుస్తున్నారు. ఈ సారి సినీ ప్రముఖులు ఎవరు ఎక్కడ ఓటు వేస్తారనేది ఆసక్తిగా మారుతోంది.

ఓట్ల పండుగకు సిద్దం : తెలంగాణ వ్యాప్తంగా జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాజకీయ..పారిశ్రామి..సినీ ప్రముఖలతో పాటుగా పలువురు హైదరాబాద్ కేంద్రంగా తమ ఓటు హక్కు వినియోగించుకోన్నారు. ఇక సినీ సెలబ్రెటీల ఓటింగ్ పైన ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ సెలబ్రెటీలు ప్రధానంగా జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలో నివాసం ఉంటున్నారు. వీరికి సమీపంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ,శ్రీకాంత్‌ ఓటు వేయనున్నారు.మహేశ్‌బాబు, నమ్రత ,మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ అదే స్కూల్ లో ఓటు వేయనున్నారు.

Tollywood celebraties to celebrities cast their ballot in hyderabad Polling stations on 30th Nov

సినీ సెలబ్రెటీల కోసం : జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎఫ్‌ఎన్‌సీసీ లో రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌ తో పాటుగా విశ్వక్‌సేన్‌.. దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు ఓట్లు వేయనున్నారు. ఇక, వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌(పోలింగ్‌ బూత్‌ 151) లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌ ఓటు వేయనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ (పోలింగ్‌ బూత్‌ 153) లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ ఓటు వేస్తారు. ఓబుల్‌రెడ్డి స్కూల్‌(పోలింగ్‌ బూత్‌ 150) లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ(పోలింగ్‌ బూత్‌ 157) లో రవితేజ , మణికొండ లోప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం ఓటు వేయనున్నారు.

పోలింగ్ శాతం పెరిగేనా : రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ లోని ఆర్థిక సహకార సంస్థలో అల్లరి నరేశ్‌, యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల లో తనికెళ్ల భరణి ఓటు వేయనున్నారు. అదే విధంగా రాజకీయ ప్రముఖులు సైతం బేగంపేట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనే తమ ఓటు హక్కు వినియోగించుకోన్నారు. ప్రతీ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ, నాగార్జునతో సహా పలువురు సినీ సెలబ్రెటీలు పోలింగ్ ప్రారంభం అయిన సమయంలోనే వచ్చి ఓటు వేస్తున్నారు. ఈ సారి అదే విధంగా ప్రారంభం సమయంలోనే ఓటు వేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇక, గతం కంటే పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+