Gaddar: గద్దర్‍కు నివాళులు అర్పించిన సినీప్రముఖులు..

అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అంటూ.. ప్రజల్లో స్పూర్తిని ప్రజా యుద్ధనౌక గద్దర్ ఇక లేరు. గద్దర్ మరణం పట్ల చాలా మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్ కు నివాళులు అర్పించి.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గద్దర్ పూల మాల వేసి నివాళులు అర్పించారు.

గొప్ప కళాకారుడిని కోల్పోయామన్నారు. గద్దర్ మృతి తెలంగాణ సమాజానికి తీరన లోటని చెప్పారు. తల్లిదండ్రుల సమాధి వద్దే తనను కూడా పెట్టాలని చివరిగా గద్దర్ తనతో మాట్లాడిన మాటలని తెలిపారు. గద్దర్ భౌతికకాయానికి నటి జీవిత నివాళులు అర్పించారు. తమ కుటుంబానికి గద్దర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. గద్దర్ లేరన్న విషయాన్ని మరిచిపోలేకపోతున్నామన్నారు. నటుడు మంచు మనోజు ఎల్బీ స్టేడియంలో గద్దర్ కు నివాళులు అర్పించారు.

Gaddar

ప్రముఖ రచయత పరుచూరి గోపాలకృష్ణ గద్దర్ భౌతికకాయాన్ని సందర్శించారు. ఆయనకు నివాళులు అర్పించారు. గద్దర్ మృతదేహానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ, కళాకారుడు గోరెటి వెంకన్న గద్దర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. శాసన సభ స్వీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్ గద్దర్ కు నివాళులు అర్పించారు.

Gaddar
ఏపీ మంత్రి బొత్ససత్యనారాయణ, నిర్మాత బండ్ల గణేష్ గద్దర్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ట్విట్టర్ వేదికగా గద్దర్ కు నివాళులు అర్పించారు. "వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం !. సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటల తో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. రజా సాహిత్యం లో, ప్రజా ఉద్యమాల లో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు ,లక్షలాది ఆయన అభిమానులకు , శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం !" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

గద్దర్ రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్ఫూర్తిని నింపారని ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. 'ప్రజా గాయకుడు గద్దర్ మన మధ్యన లేకున్నా.. ఆయన ఆట, మాట, పాట ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటాయని తెలిపారు.
గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో ఆయన అంత్యక్రియలు చేయనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+