నేనొక్కడినేనా

Dil Raju: ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజుకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లో గల ఆయన నివాసం, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు. మంగళవారం తెల్లవారు జాము నుంచి ఏకకాలంలో ఈ దాడులు మొదలయ్యాయి.

ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు- గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం నిర్మాత ఆయనే. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ రెండూ తెరకెక్కాయి. మూడు రోజుల వ్యవధిలో విడుదల అయ్యాయి. ఈ నెల 10న గేమ్ ఛేంజర్, 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యాయి.

Tollywood film producer Dil Raju responds to IT raids

ఈ రెండు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. అదే స్థాయిలోనే కలెక్షన్లు సాధించాయంటూ అధికారికంగా ప్రకటించుకోవడం ఈ ఐటీ దాడులకు కారణమైనట్లు చెబుతున్నారు. దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా పుష్ప-2 దర్శకుడు సుకుమార్ కూడా ఐటీ రాడార్‌లోకి వెళ్లారు. ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు చేపట్టారు. పుష్ప 2 సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ సహా ఆయనకు ఉన్న ఆదాయ వనరుల గురించి ఆరా తీస్తోన్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌ను ఎయిర్‌పోర్ట్‌లోనే పికప్ చేసుకున్నట్లు సమాచారం.

పుష్ప 2ను నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు సుకుమార్ 15 కోట్ల రూపాయల మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆదాయపు పన్నులను ఆయన చెల్లించారా? లేదా? అని ఐటీ అధికారులు ఆరా తీస్తోన్నట్లు చెబుతున్నారు.

ఈ వరుస ఐటీ దాడులపై దిల్ రాజు స్పందించారు. ఈ తనిఖీలు, సోదాలు, తన ఒక్కడి ఇంటిపైనే కాదని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తంపై కూడా జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఒకేసారి వేర్వేరు ప్రొడక్షన్ హౌస్‌లు, నిర్మాతలు, దర్శకల ఇళ్లపై జరుగుతున్న దాడులు, కొనసాగుతున్న తనిఖీలను ఆయన గుర్తుచేశారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+