టాలీవుడ్ టాప్ హీరోల్లో 'కేదార్' గుబులు - భారీ పెట్టబడులు, లిస్టులో..!!

టాలీవుడ్ నిర్మాత సెలగంశెట్టి కేదార్ ఆకస్మిక మరణం టాలీవుడ్ లో గుబులు రేపుతోంది. దుబాయ్‌ కేంద్రంగా లో నిర్మాణ, స్థిరాస్తి రంగాల్లో కేదార్‌ వ్యాపారాలు నిర్వహించారు. కేదార్ పైన నమ్మకంతో టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు.. నిర్మాతలు.. దర్శకులు వందల కోట్లు పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు కేదార్ ఆకస్మిక మరణంతో ఆ పెట్టుబడుల వివరాలు తెలియక వారిలో ఆందోళన మొదలైంది. ఈ జాబితాలో టాలీవుడ్ లో టాప్ పొజీషన్స్ లో ఉన్నవారు సైతం ఉండటంతో... కొత్త కలకలం మొదలైంది.

కేదార్ మరణంతో
సినీ నిర్మాత కేదార్ ఆకస్మిక మరణంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుబాయ్ లో కేదార్ భారీ పెట్టబడులతో వ్యాపారాలు నిర్వహించారు. కేదార్ వ్యాపారాల్లో తెలుగు సినీ ఇండస్ట్రీ కి చెందిన పలువురు ప్రముఖ హీరోలు వందల కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలస్తోంది. వారికి కేదార్ బినామీగా వ్యవహరిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కేదార్‌ ఆకస్మిక మరణంతో ఇప్పుడు తమ పరిస్థితేంటనే టెన్షన్ వారిలో కనిపిస్తోంది. కేదార్ తమ డబ్బు ఎక్కడ పెట్టుబడిగా పెట్టాడనేది పలువురు హీరోలు.. సినీ ప్రముఖులకు పూర్తి సమాచారం లేదు. దీంతో, సినీ ప్రముఖు లు తమ పెట్టుబడుల గురించి బయటకు చెప్పలేక.. సమాచారం తెలియక టెన్షన్ లో ఉన్నారు.

Tollywood producer Kedar Selagamsetty sudden death leads to new tension Tollywood details here

భారీ పెట్టబడులు
కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌లోని ర్యాడిసన్‌ హోటల్‌లో బయటపడిన డ్రగ్స్‌ కేసు అంశంలో కేదార్‌ పేరు వినిపించింది. ఆ తరువాత దుబాయ్ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారా లు చేస్తూ పలు లేక్‌వ్యూ ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రచారం ఉంది. దుబాయ్‌లోని ఓ పెద్ద ల్యాండ్‌ డెవలపింగ్‌ కంపెనీలో కేదార్‌ కీలక వాటాదారుగా ఉన్నారని చెబుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్ర క్షన్‌ కంపెనీలకు ఆ సంస్థ భూముల క్రియ విక్రయాలు నిర్వహిస్తుంది. దీంతో..టాలీవుడ్‌ ప్రముఖు ల తరఫున కేదార్‌ ఆ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. కాగా.. కేదార్ తొమ్మది కంపెనీల్లో డైరెక్టర్ - ఛైర్మన్ వంటి హోదాల్లో ఉన్నట్లు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ సమాచారం.

ఇప్పుడు ఏం చేయాలి
కేదార్ బాధ్యతలు తీసుకున్న మెజార్టీ కంపెనీలు కన్‌స్ట్రక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలకు సం బంధించినవేనని సమాచారం. పలువురు అగ్రహీరోలతో పాటుగా పొలిటికల లీడర్స్ సైతం కేదార్ తో ఉన్న సంబంధాలతో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినీ - రాజకీయ ప్రము ఖులు కేదార్ ఆహ్వానం మేరకు దుబాయ్ వెళ్లేవారు. వారికి సంబంధించిన పెట్టుబడులు.. లెక్కలు మొత్తం కేదార్ కు మాత్రమే తెలుసు. ఇప్పుడు కేదార్ మరణంతో పెట్టుబడి పెట్టిన సినీ ప్రముఖు లతో పాటుగా రాజకీయ నేతల్లోనూ గుబులు మొదలైంది. కేదార్ ను నమ్మి పెట్టిన భారీ పెట్టుబడు లు అసలు ఎందులో ఉన్నాయి.. ఎలా తిరిగి రాబట్టుకోవాలో తెలియని అగమ్య గోచర పరిస్థితుల్లో వీరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేదార్ మరణంతో పెట్టుబడులు పెట్టిన వారంతా ఏం చేయాలో తెలియని నిస్సహా స్థితిలో ఉన్నట్లు టాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+