Tomato Price: సెంచరీ కొట్టిన టమాటా ధర..!
టమాటా ధరలు భారీగా పెరుగుతోన్నాయి. నెలన్నర క్రితం వరకు కిలో రూ.20 నుంచి రూ.30 పలికిన టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత పదిహేను రోజుల్లో అయితే ఈ కూరగాయ ధర డబుల్ అయింది. ప్రస్తుతం హోల్ సెల్ మార్కెట్ లో కిలో టమాటా రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది. ఇక రిటైల్ అయితే రూ.100 దాటినట్లు తెలుస్తోంది. డిమాండ్ కు సరిపడ టమాటా రాకపోవడమే ఇందుకు కారణమని కూరగాయ వ్యాపారులు చెబుతున్నారు.
ఆ మధ్య కురిసి భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బతిన్నాయని.. దీంతో ధరలు అమాంతం పెరిగాయని పేర్కొంటున్నారు. హైదరాబాద్ కు తెలంగాణలోని జిల్లాల నుంచి కాకుండా రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాటా వస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి పంట రాక తగ్గడంతో పాటు.. రాష్ట్రంలో పంట దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. సాధారణంగా టమాటా ధర వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ధర తక్కువగా ఉండాలి.

భారీ వర్షాలతో దిగుబడి తగ్గి ధర పెరిగినట్లు చెబుతున్నారు. ఈ ధరలు మరో నెల పాటు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త పంట చేతికి వచ్చే వరకు ఇవే ధరలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఉల్లి ధరలు కూడా భారీగానే పెరిగింది. రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లి రూ. 60 నుంచి రూ.70 పలుకుతోంది. కేంద్రం ఉల్లి ఎగుమతి పై సుంకం ఎత్తివేయడంతో ధరలు భారీగా పెరిగాయి. అయితే సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి కేంద్రం బఫర్ స్టాక్ ను రిలీజ్ చేసింది. అలాగే నాఫేడ్ ద్వారా రూ.35 కిలో ఉల్లిని విక్రయిస్తోంది.
ఇక వెల్లుల్లి ధర కూడా భారీగానే పెరిగింది. మంచి క్వాలిటీ ఉన్న వెల్లుల్లి కిలో రూ. 500 పలుకుతోంది. డిమాండ్ సరిపడ సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. రెండు, మూడు నెలల వరకు ఇవే ధరలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఇక మిగతా కూరగాయల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ఇక స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.300 లకు పెరిగింది. కోడి గుడ్ల ధరలు కూడా పెరిగాయి. గుడ్డ ఒక్కొటి రూ.6 పలుకుతున్నాయి. ఇది చాలదు అన్నట్లు వంట నూనె ధరలు కూడా పెరిగాయి. దీంతో సామాన్యులు బతుకలేని పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications