Hyderabad Traffic: 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు ఇలా
హైదరాబాద్: నగరంలో బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం, సోమవారం పాతబస్తీలోని ప్రధాన ఆలయాల్లో బోనాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయంలో జులై 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఈ రూట్లో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
పలు మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రూట్లో ప్రయాణం చేసే వారు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

దారి మళ్లించే మార్గాలు:
జులై 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జులై 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ రూట్లలో దారి మళ్లింపు చర్యలు అమలులోకి ఉంటాయి.
ఉప్పల్ నుంచి అంబర్‌పేట్ వైపు వచ్చే అన్ని జిల్లాల బస్సులు, సిటీ బస్సులు, భారీ వాహనాలు ఉప్పల్ x రోడ్డులో హబ్సిగూడ - తార్నాక - అడిక్‌మెట్ - విద్యా నగర్ - ఫీవర్ హాస్పిటల్ - T.Y మీదుగా మళ్లిస్తారు. మండలి - టూరిస్ట్ హోటల్ జంక్షన్ - నింబోలిఅడ్డ - చాదర్‌ఘాట్, సీబీఎస్ తిరిగి వచ్చే మార్గం వైస్ వెర్సాగా ఉంటుంది.
కోఠి నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు, సిటీ బస్సులు నింబోలిఅడ్డ - టూరిస్ట్ హోటల్ - TY మండలి - ఫీవర్ హాస్పిటల్ అడిక్‌మెట్ - తార్నాక - హబ్సిగూడ - ఉప్పల్ X రోడ్ల మీదుగా తిరుగు మార్గంలో మళ్లిస్తారు.
ఉప్పల్ నుంచి అంబర్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను రాయల్ జ్యూస్ కార్నర్ - మల్లికార్జున నగర్ - డిడి కాలనీ - సిండికేట్ బ్యాంక్ శివం రోడ్ వద్ద మళ్లిస్తారు. గోల్నాక, మూసారాంబాగ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సీపీఎల్ వైపు మళ్లిస్తారు. అంబర్‌పేట్ - సల్దానా గేట్ - అలీ కేఫ్ X రోడ్లు, తిరుగు మార్గంలో వైస్ వెర్సా ఉంటుంది.
ఈ రూట్లలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలుంటాయని, ఎటువంటి అడ్డంకులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవడానికి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని నగర పోలీసులు ప్రజలకు సూచించారు. కాగా, ఈ రెండు రోజులు కూడా నగరంలో మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రోజునే మద్యం షాపుల ముందు భారీగా మందుబాబులు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications