రేపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు: ఈ మార్గాల్లో వెళ్లొద్దు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు శరవేగంగా కొనసాగుతున్నాయి. గురువారం జరగనున్న ఈ కార్యక్రమం కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సందర్భంగా గురువారం ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర డీజీపీ రవి గుప్తా తెలిపారు.
గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

ట్రాఫిక్ ఆంక్షలతో వాహనాలు దారి మళ్లించడం ద్వారా రవీంద్రభారతి, ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ కాంప్లెక్స్, బషీర్ బాగ్, ఎస్బీఐ గన్‌పౌండ్రి, అబిడ్స్ సర్కిల్, లిబర్టీ సర్కిల్, హిమాయత్ నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్ కూడళ్ల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నగరవాసులు ఎల్బీ స్టేడియానికి వచ్చే మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయదారులు ఎంచుకోవాలని సూచించారు. ఏదైనా అసౌకర్యం ఏర్పడితే హెల్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు.

#TrafficAdvisory
— Hyderabad City Police (@hydcitypolice) December 6, 2023
In view of swearing-in-ceremony of Sri Anumula Revanth Reddy as Chief Minister of Telangana State at LB Stadium on 07.12.2023, the following traffic restrictions are likely to be implemented from 1000 hrs to 1700 hrs.
The traffic will....https://t.co/b1I3gwFxDE pic.twitter.com/bn3EDjhVSu
గురువారం ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ఉండనున్నాయి..
పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లింపు
ఎస్బీఐ గన్ పౌండ్రీ నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు మళ్లింపు
బషీర్ బాగ్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి వైపు మళ్లింపు
సుజాత స్కూల్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లింపు
మరోవైపు, ఎల్‌బీ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లను తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సీఎం ప్రమాణ స్వీకార కార్య క్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం నేపథ్యంలో గురువారం ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. దాదాపు లక్ష మంది సభకు హాజరు కావొచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని తెలిపారు. ఎల్‌బీ స్టేడియంలో 30 వేల మందికి కూర్చొనే సౌకర్యం ఉందన్నారు. మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని డీజీపీ తెలిపారు.
-
డాడీ, మోదీ, చిన్న మోదీపైనే నా పోరాటం: కవిత -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. అట్టహాసంగా గద్దర్ అవార్డ్స్ -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!











Click it and Unblock the Notifications