Hyderabad Traffic: ఈ మూడు రోజులు హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పవు..
బడ్జెట్ సమావేశాలు, ఫార్మలా ఈ-రేస్ కారణంగా హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షాలు విధించారు.
హైదరాబాద్ వాసులకు మరో నాలుగు రోజులు ట్రాఫిక్ కష్టలు తప్పేలా లేవు. ఫార్ములా ఈ-రేస్, బడ్జెట్ సమావేశాల కారణంగా నగరంలోని పలు చోట్లు ట్రాఫిక్ ఆంక్షాలు విధించారు. దింతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బడ్జెట్ సెషన్ కారణంగా పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ, రవీంద్ర భారతి, డీజీపీ ఆఫీస్, లక్డీ కఫుల్ ప్రాంతాల్లో కాస్త ట్రాఫిక్ ఏర్పడుతుంది.

హుస్సేన్ సాగర్
ముఖ్యంగా ఉదయం, సాయంత్రి ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. హుస్సేన్ సాగర్ తీరన ఫిబ్రవరి 11 నుంచి ఫార్ములా ఈ-రేస్ నిర్వహిస్తుండడంతో పలు చోట్ల ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ ను మూసివేశారు. దీంతో ఎర్రమంజిల్, కేసీపీ, ఆర్టీఏ ఆఫీస్, వీవీ విగ్రహం, షాదన్ కాలేజీ, లక్డీకఫుల్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతోంది.

పీక్ అవర్స్
పీక్ అవర్స్ లో సెయింట్ అన్నస్ స్కూల్, నార్త్ జోన్, వైఎంసీఏ, ప్యాట్నీ ఎక్స్ రోడ్ నుంచి ప్యారడైజ్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. కొందరు వాహనదారులు రోడ్డుపై వాహనాలు పార్కు చేయడం కూడా ట్రాఫిక్ జామ్ కారణంగా చెబుతున్నారు. ఫార్ములా ఈ-రేస్ కారణంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షాలు విధించారు.

తెలుగు తల్లి ఫ్లై ఓవర్
తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి ఖైరతాబాద్ కు అనుమతించడం లేదు. అలాగే మింట్ కాపౌండ్ వైపు కూడా వాహనాలు అనుమతించడం లేదు. ట్రాఫిక్ ఆంక్షాలతో ప్రధాన కూడళ్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడ అవకాశం ఉంది. కాగా ఇండియాలోనే మొదటి సారిగా ఏబీబీ ఫీఐఏ ఫార్ములా ఈ రేసును హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ రేసులో 22 మంది డ్రైవర్లు పాల్గొనున్నారు.

ట్రాఫిక్ ఆంక్షాలు
తెలంగాణ బడ్జెజ్ సమావేశాల దృష్ట్యా తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఇగ్బల్ మీనార్, రవీంద్ర భారతి, వీవీ స్టాట్యూ, షాదన్ కాలేజీ, నిరంకారి, సైఫాబాద్ పాత్ పోలీస్ స్టేషన్, మసాబ్ ట్యాంక్, పీటీఐ బిల్డింగ్, బీజేఆర్ విగ్రహం, కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్, బషిర్ బాగ్ జంక్షన్ నుంచి పీసీఆర్ జంక్షన్ వరకు ట్రాఫిక్ ఆంక్షాలు విధించండంతో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు.












Click it and Unblock the Notifications