రిపబ్లిక్ డే వేడుకల్లో విషాదం..జెండా పోల్ విద్యుత్ వైర్ తగిలి ఇద్దరు మృతి...
దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతుంటే తెలంగాణలోని ఓ జిల్లాలో మాత్రం రిపబ్లిక్‌డే వేడుకల్లో విషాదం నెలకొంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు రాజకీయ, ప్రజాప్రతినిధులు, అధికారులు జెండాలు ఎగురవేశారు. అయితే, జెండావిష్కరణ అనంతరం కొన్ని ప్రాంతాల్లో అపశృతులు నెలకొన్నాయి. అలాంటి ఘటనే ఒకటి తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగింది. రిపబ్లిక్ డే వేడుకల్లో అక్కడ విషాదం అలుముకుంది. జెండా పోల్ విద్యుత్ వైర్లకు తగిలి ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు.
దీంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ములుగు పట్టణంలోని శివాలయం వీధిలో జాతీయ జెండా ఎగురవేస్తుండగా ఈఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ జెండా ఆవిష్కరణ కోసం పనులు చేస్తున్న క్రమంలో, జెండా ఐరన్ పైపు విద్యుత్ తీగకు తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.

ప్రమాదంపై స్పందించిన మంత్రి సీతక్క : అయితే, ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే చనిపోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. మృతులు పట్టణానికి చెందిన ల్యాడ విజయ్ (28), బోడ అంజిత్ (38)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఈ ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ములుగు ఏరియా ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను సందర్శించి ఆమె నివాళులు అర్పించారు. జెండా ఆవిష్కరణ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, కరెంట్ వైర్లు వంటి ద్వారా ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని, ఇలాంటి పనుల్లో జాగ్రత్తలు వ్యవహరించాలని ఆమె సూచించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications